మెహ్రీన్ సీన్స్ కి కోత పడిపోయింది

మెహ్రీన్ సీన్స్ కి కోత పడిపోయింది

కృష్ణగాడి వీర ప్రేమ గాధతో టాలీవుడ్ కి పరిచయం అయిన భామ మెహ్రీన్ కౌర్ పీర్జాడా. మధ్యలో ఓ బాలీవుడ్ సినిమాలో కూడా మెరిసినా.. ఈ అందాల భామ టాలీవుడ్ లో వరుస సినిమాలను రిలీజ్ చేసేస్తోంది. రీసెంట్ గానే రవితేజతో కలిసి రాజా ది గ్రేట్ అంటూ మంచి హిట్ కొట్టేసింది కూడా.

ఇప్పుడు కేరాఫ్ సూర్య అంటూ ఓ తమిళ్-తెలుగు బైలింగ్యువల్ మూవీలో కూడా నటించగా.. గత శుక్రవారం నాడు ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ సెకండాఫ్ ను జనాలు తెగ పొగిడేస్తున్నారు. విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించే స్థాయిలో రెండో భాగం సాగింది. కాగా ఫస్టాఫ్ విషయంలో మాత్రం సాగతీత ఎక్కువ అయిందనే మాటలు అటు తమిళ్ లోను.. ఇటు తెలుగులోని వినిపించాయి. ప్రధానంగా హీరోయిన్ మెహ్రీన్ కి సంబంధించిన సన్నివేశాలు.. సినిమా థీమ్ కు అంతగా అతకలేదనే మాటలు బోలడన్ని వినిపిస్తున్నాయి.

దీంతో ఇప్పుడు కేరాఫ్ సూర్య మూవీ నిడివిని 20 నిమిషాల పాటు తగ్గిస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇందులో హీరోయిన్ మెహ్రీన్ కు సంబంధించిన సీన్స్ ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పడం విశేషం. మెహ్రీన్ అందాలు బాగానే ఉన్నా.. సినిమా కాన్సెప్ట్ ను ఇవి పక్కదారి పట్టించడమే కాకుండా.. కథనంలో గ్రిప్ లేకుండా చేస్తున్నాయనే కామెంట్స్ కారణంగానే.. వీటిని తొలగిస్తున్నట్లు చెప్పాడు దర్శకుడు సుశీంద్రన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు