నారా సినిమాలో ఉయ్యాలవాడ

నారా సినిమాలో ఉయ్యాలవాడ

నారా రోహిత్ నటించిన కొత్త సినిమా ట్రైలర్ ఇప్పుడు బాగానే సందడి చేస్తోంది. ఈ హీరో తొలిసారిగా పక్కా కమర్షియల్ మూవీ చేయడం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. మరోవైపు బాగా ఒళ్లు తగ్గించి.. కండలు పెంచి.. ఫిట్ గా ఉన్న నారా రోహిత్ ను చూసి ఫ్యాన్స్ భలే ఖుషీ అయిపోతున్నారు. నారా హీరో అయినా సరే.. నందమూరి ఫ్యాన్స్ నుంచి ఈ కుర్రాడికి బోలెడంత సపోర్ట్ ఉందనే సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో ఫ్యామిలీ వారసత్వాలు సహజమే. అయితే.. ఒక కుటుంబానికి చెందిన సినిమాలో మరో ఫ్యామిలీకి సంబంధించిన రిఫరెన్సులు కనిపించడం అరుదు. ఒకవేళ ఉన్నా.. ఇన్ డైరెక్టు సెటైర్స్ మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు నారా రోహిత్ సినిమాలో మెగాస్టార్ మూవీ రిఫరెన్స్ కనిపించడం ఆశ్చర్యకరం. బాలకృష్ణుడు ఫ్యాషన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ సినిమాలో.. ఉయ్యాలవాడ ఊరు బోర్డును చూపించారు. అంటే హీరో కానీ.. విలన్ కానీ ఆ ఊరుకు సంబంధించిన వారు ఉంటారన్న మాట.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటూ మెగాస్టార్ చిరంజీవి సై రా నరసింహా రెడ్డి మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరు సినిమా రావడానికి ఇంకా ఏడాది సమయం పట్టనుంది. కానీ నారా రోహిత్ మాత్రం.. అప్పుడే ఉయ్యాలవాడను జనాలకు పరిచయం చేసేయనున్నాడు. నందమూరి ఫ్యామిలీకి దగ్గరి వ్యక్తి అయిన ఈ హీరో.. మెగాస్టార్ రిఫరెన్స్ ను చూపించడం ఆశ్చర్యకరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English