వామ్మో.. ఒక్క రోజులో ఎనిమిది సినిమాలా?

వామ్మో.. ఒక్క రోజులో ఎనిమిది సినిమాలా?

నవంబరు నెల చిన్న సినిమాల కోసమే ఉన్నట్లుంది. క్లియరెన్స్ సేల్‌లో వస్తువుల్ని తోసేసినట్లుగా చాన్నాళ్లుగా విడుదలకు నోచుకోకుండా ఎదురు చూస్తున్న సినిమాలన్నింటినీ ఈ నెలలోనే థియేటర్లలోకి వదిలేస్తున్నట్లుగా ఉంది. ఈ నెల మొదటి వారాంతంలో మూడు సినిమాలు.. రెండో వారాంతంలో నాలుగు సినిమాలు రిలీజైన సంగతి తెలిసిందే.

ఐతే ఈ రెండు వారాల్లో కలిపి రిలీజైన సినిమాల సంఖ్య కంటే.. వచ్చే వారాంతంలో రిలీజవుతున్న సినిమాల సంఖ్య ఎక్కువ కావడం విశేషం. వచ్చే శుక్రవారం ఒకే రోజు ఏకంగా ఎనిమిది సినిమాలు రిలీజవుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.

వచ్చే వీకెండ్లో రెండు ద్విభాషా చిత్రాలు వస్తున్నాయి. అవే.. కార్తి నటించిన ‘ఖాకి’.. సిద్దార్థ్ నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘గృహం’. వీటిలో ‘ఖాకి’ ఎప్పుడూ నవంబరు 17కు షెడ్యూల్ కాగా.. ఈ నెల 3నే రావాల్సిన ‘గృహం’ కొన్ని కారణాల వల్ల వాయిదా పడి లేటుగా వస్తోంది. ఇక శివబాలాజీ సినిమా ‘స్నేహమేరా జీవితం’ ఉన్నట్లుండి రేసులోకి వచ్చి 17కు ఫిక్సయింది. అలాగే స్వాతి ప్రధాన పాత్ర పోషించిన ‘లండన్ బాబులు’ కూడా ఈ వారంలోనే రాబోతోంది. ఈ వారం రాబోతున్న వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఇవే.

ఇవి కాకుండా ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ అనే హార్రర్ టచ్ ఉన్న సినిమా.. ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే రొమాంటిక్ మూవీ.. ‘దేవిశ్రీ ప్రసాద్’ అనే థ్రిల్లర్.. ‘లవర్స్ క్లబ్’ అనే మరో సినిమా కూడా ఈ వారానికే షెడ్యూల్ అయ్యాయి. మరి ఒకేసారి ఇన్ని సినిమాలంటే వీటికి థియేటర్లు ఎలా సర్దుబాటు చేస్తారో.. వీటిలో ఏవి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English