తమిళ ‘అర్జున్ రెడ్డి’ టీం షాకిచ్చిందే..

తమిళ ‘అర్జున్ రెడ్డి’ టీం షాకిచ్చిందే..

తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా ‘వర్మ’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎవరు చేస్తారా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘జై చిరంజీవ’ సినిమాలో బాల నటిగా కనిపించి.. ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో హీరోయిన్‌గా మారిన శ్రియ శర్మ ఇందులో కథానాయిక అని ముందు ప్రచారం జరిగింది.

కానీ ఆ విషయాన్ని చిత్ర బృందం ధ్రువీకరించలేదు. ఐతే మొన్న సోషల్ మీడియాలో బీచ్ ఒడ్డున అమ్మాయి అందంగా పడుకున్న ఫొటో ఒకటి పెట్టి.. ‘వర్మ’ లవర్ ఎవరో తెలుసుకోవాలని ఉందా.. అయితే రేపు మధ్యాహ్నం వరకు వెయిట్ చేయండి అంటూ అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది చిత్ర బృందం. ఆల్రెడీ హీరోయిన్ని ఎంపిక చేసేసి ఆమె ఎవరో ప్రకటించబోతున్నారని అంతా అనుకున్నారు. కానీ ‘వర్మ’ టీం మాత్రం పెద్ద షాకిచ్చింది.

ఈ సినిమాకు హీరోయిన్ని ఎంపిక చేయలేదని.. కొత్తవాళ్లకు అవకాశమివ్వబోతున్నామని.. తాము చెప్పే లక్షణాలున్న అమ్మాయిలు హీరోయిన్‌గా ట్రై చేయొచ్చని ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన వీడియోకు శ్రుతి హాసన్ వాయిస్ ఇవ్వడం విశేషం. దీంతో హీరోయిన్ ఎవరో చెబుతారేమో అని ఎదురు చూసిన వాళ్లందరూ నిరాశ చెందగా.. హీరోయిన్ అవుదామని కలలు కంటున్న అమ్మాయిలు మాత్రం ఉత్సాహంగా ప్రొఫైల్స్ పంపించే పనిలో పడ్డారు. ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు బాల తీయబోతున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English