రెజీనా.. కమ్ములకు నో చెప్పిందా!

రెజీనా.. కమ్ములకు నో చెప్పిందా!

రెజీనా కసాండ్రా.. ‘ఎస్‌ఎంఎస్’ లాంటి చిన్న సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ప్రస్థానం మొదలుపెట్టి ఆ తర్వాత పవర్, సుబ్రమణ్యం ఫర్ సేల్, సౌఖ్యం లాంటి పెద్ద సినిమాల్లో నటించిన కథానాయిక. ఓ దశలో ఆమె ఊపు చూస్తే స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారు.

కానీ రెజీనా ఒక స్థాయికి మించి ఎదగలేకపోయింది. ఇప్పుడు ఆమె కెరీర్ మరింత డల్లయింది. త్వరలోనే ‘బాలకృష్ణుడు’ సినిమాతో పలకరించబోతున్న రెజీనా.. ఓ ఇంటర్వ్యూలో తాను మిస్సయిన కొన్న సినిమాల గురించి చెప్పుకొచ్చింది. శేఖర్ కమ్ముల సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో హీరోయిన్ పాత్రకు తనను అడిగితే చేయనని చెప్పేసినట్లు రెజీనా వెల్లడించింది.

ఐతే అందులో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండటం వల్ల తనకు పెద్దగా పేరు రాదని భావించే ఆ సినిమా ఒప్పుకోలేదని రెజీనా చెప్పింది. అప్పటికి తాను తెలుగులో సినిమాలేమీ చేయనప్పటికీ ఆ ఆఫర్ తిరస్కరించానని తెలిపింది. దీని బదులు ‘ఎస్ఎంఎస్’ సినిమా ద్వారా సోలో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికే మొగ్గు చూపినట్లు వెల్లడించింది. ఇక మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్‌తో పని చేసే అవకాశం కూడా అనుకోకుండా కోల్పోయినట్లు రెజీనా చెప్పింది.

దూరదర్శన్ కోసం తాను ఓ షో చేశానని.. ఆ షో డైరెక్టర్ మణిరత్నంకు అసిస్టెంట్ అని.. అలా ‘యువ’ సినిమాలో సూర్య చెల్లెలి పాత్రకు అతను రికమండ్ చేయడంతో మణిరత్నం ఓకే చెప్పారని.. కానీ అదే సమయంలో తన ఫ్యామిలీ మరో ఇంటికి మారడంతో అడ్రస్ కనుక్కోలేకపోయారని.. అలా తనకు అవకాశం మిస్సయిందని రెజీనా చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు