పవన్-రేణు ప్రేమకథ.. ఎలా మొదలైంది?

పవన్-రేణు ప్రేమకథ.. ఎలా మొదలైంది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ‘బద్రి’ సినిమా సమయంలో ప్రేమలో పడటం.. ఆపై ఇద్దరూ సహజీవనం చేయడం.. ఓ బిడ్డను కూడా కనడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం.. కొన్నేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోవడం.. అన్నీ తెలిసిన సంగతులే. ఐతే వీరి మధ్య అసలు ప్రేమ ఎలా చిగురించిందన్నది మాత్రం తెలియదు. పవన్ ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెనవ్వడు. రేణు దేశాయ్‌కు కూడా ఎక్కడా దీని గురించి మాట్లాడే అవకాశం రాలేదు. ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ముచ్చట్లు పంచుకుంది రేణు.

‘‘నేను మోడలింగ్ చేసే రోజుల్లో ఏదో మ్యాగజైన్‌లో నా ఫొటో చూసి నాకు ‘బద్రి’లో అవకాశమిచ్చారు పూరి జగన్ గారు. నా ఫొటో చూసిన ఆరు నెలల తర్వాత పిలిచి అవకాశమిచ్చారు. ఐతే నాకు నిజానికి సినిమా చేసే ఉద్దేశం లేదు. హీరోను ఒకసారి కలిశాక కంఫర్ట్ అనిపిస్తేనే చేస్తాను అని చెప్పాను. అప్పుడు ఓ హోటల్లో పవన్ గారిని కలిశాను. ఆయన్ని చూడగానే నచ్చేశారు. లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నమాట.

ఆ తర్వాత షూటింగుకి వెళ్లాం. ఆరు నెలల పాటు ఇద్దరి మధ్య ప్రత్యేకమైన మాటలేమీ లేవు. ఉదయం గుడ్ మార్నింగ్.. సాయంత్రం గుడ్ ఈవెనింగ్. ఇద్దరం కలిసి చాలా రొమాంటిక్ సీన్స్ చేసినా కూడా ఏ రకంగానూ క్లోజ్ అవ్వలేదు. కానీ చివరి షెడ్యూల్లో కేప్ టౌన్లో మిస్సమ్మా పాట షూట్ చేసే సమయంలో ఇద్దరం దగ్గరయ్యాం. స్నేహితులుగా మారాం. కలిసి డిన్నర్ చేయడాలు.. కబుర్లు చెప్పుకోవడాలు జరిగాయి.

పవన్ గారి మీద నా ఇష్టం జగన్ గారు కనిపెట్టేసి అప్పుడప్పుడూ టీజ్ చేసేవారు. యూనిట్లో వాళ్లకు కూడా మా మీద అనుమానం వచ్చింది. ఐతే మేమేమీ అప్పుడు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదు. మా లైఫ్‌లో ‘ఐలవ్యూ’ చెప్పుకున్న మూమెంటే లేదు. కానీ దగ్గరైపోయాం. కలిసి జీవించడం మొదలుపెట్టాం. నిజానికి మాది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ. అయినప్పటికీ పవన్ గారి మీద నమ్మకంతో సహజీవనం చేశాను. మా వాళ్లు భయపడ్డప్పటికీ ఆయన చాలా మంచి వారని, ఏ అలవాట్లూ లేవని, షూటింగ్ టైంలో ఎంత పద్ధతిగా ఉండేవారో చెప్పి ఆయనతో కలిసి ఉన్నాను. తర్వాత పవన్ గారు మా నాన్నతో మాట్లాడారు. మా వాళ్లు ఆయన ఫ్యామిలీతో మాట్లాడి.. ఒక అరేంజ్ మ్యారేజ్ లాగే మా పెళ్లి జరిగింది’’ అని రేణు తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English