అందుకు పద్మవాతిని వాడుకుంటారా? టూ మచ్

అందుకు పద్మవాతిని వాడుకుంటారా? టూ మచ్

దీపికా పదుకొనే నటించిన పద్మావతి చిత్రం రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం ఇప్పుడు గుళ్లు గోపురాల చుట్టూ దీపికా పదుకొనే చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా తిరుమల వెంకన్న దర్శనం కూడా చేసుకుంది.

అయితే.. ఇలా తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవడం దీపికకు కొత్తేమీ కాదు. కాకపోతే ఈసారి మాత్రం ప్రత్యేకత ఏంటంటే.. తిరుపతి చెంతనే ఉన్న అలివేలు మంగాపురంలో ఉన్న పద్మావతి అమ్మవారిని కూడా దీపికా పదుకొనే సందర్శించుకోవడమే. ఇటు పద్మావతిగా నటిస్తున్న దీపికా.. పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం ఆసక్తికరం. పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలని ఈ సారి దీపిక ముందుగానే గట్టి నిర్ణయం తీసుకుందని.. అందుకే ఈ సారి ప్రత్యేకంగా దర్శనం చేసుకుందని తెలుస్తోంది.

కాని కామెడీ ఏంటంటే.. పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం కూడా ''పద్మావతి'' సినిమా ప్రమోషన్ కోసం వాడేసుకోవాలా? ఈ బాలీవుడ్ హీరోయిన్ల పీఆర్ టీమ్స్ ఎంత దారుణంగా పనిచేస్తాయంటే.. ప్రతీ చిన్న విషయాన్ని ప్రమోషన్ కు వాడుకుంటుంటారు. కాని పద్మావతి అనే దేవతకు.. పద్మావతి సినిమాకు.. అస్సలు లింకే లేని సమయంలో.. ప్రమోషన్ కు వాడుకోవడం.. టూ మచ్ నానా!!

ఇక సినిమా విషయానికి వస్తే.. రీసెంట్ గా రిలీజ్ అయి ఘూమర్ పాటకు బోలెడన్ని ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా విడుదల చేస్తున్న ప్రమోషనల్ పోస్టర్స్ అయితే.. సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English