మహేష్ ముందే వచ్చేస్తాడా!?

మహేష్ ముందే వచ్చేస్తాడా!?

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ భరత్ అను నేను.. ఫుల్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ కాంబో కావడంతో.. ఇండస్ట్రీ జనాల్లో కూడా ఎక్స్ పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి.

ప్రస్తుతం మహేష్ అమెరికాలో ఉన్నాడు. ఓ సాఫ్ట్ డ్రింక్ యాడ్ షూటింగ్ కోసం యూఎస్ వెళ్లిన మహేష్.. వచ్చీ రాగానే కొరటాల సినిమా షూటింగ్ లో జాయిన్ అయిపోతాడట. కొన్ని గంటలు మాత్రమే బ్రేక్ తీసుకుని.. వెంటనే తమిళనాడులోని పొలాచ్చిలో జరగనున్న షూటింగ్ కు అటెండ్ అయిపోతాడట మహేష్.

ఇంత స్పీడ్ గా షూట్ లో పాల్గొనడానికి.. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేసేయాలని మహేష్ భావిస్తుండడమే కారణంగా చెబుతున్నారు. ఏప్రిల్ 27న ఈ సినిమా రిలీజ్ అంటూ నిర్మాత అఫీషియల్ గా ప్రకటించారు. అయితే.. అప్పటికే అల్లు అర్జున్ నా పేరు సూర్య మూవీని ఇదే డేట్ కి షెడ్యూల్ చేసి ఉండడంతో.. రిలీజ్ డేట్ విషయంలో మహేష్ మూవీ మేకర్స్ నే అంతా తప్పు పడుతున్నారు.

దీంతో అభిమానులను సర్ ప్రైజ్ చేసేందుకు గాను.. ముందుగానే వచ్చేద్దామని మహేష్ బాబు ప్లాన్ చేసుకుంటున్నాడట. సంక్రాంతి నాటికే భరత్ అను నేను మూవీని విడుదల చేసేందుకు సాధ్యాసాధ్యలపై ఇప్పటికే డిస్కషన్స్ జరిపినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని ప్రారంభించినపుడు సంక్రాంతికే అనుకున్నారు. అందుకు తగినట్లుగానే షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. స్పైడర్ కారణంగా.. కొన్ని వారాల షెడ్యూల్స్ తేడా వచ్చాయి. కానీ వీటిని కవర్ చేసేలా.. మహేష్ డేట్స్ కేటాయించాడట. వీలైతే సంక్రాంతికి లేదా.. రిపబ్లిక్ డే నాటికి తన చిత్రాన్ని రిలీజ్ చేసేసే యోచనలో ఉన్నాడట మహేష్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English