లేటు వయసులో ఫీట్లు ఎందుకు త్రిషా?

లేటు వయసులో ఫీట్లు ఎందుకు త్రిషా?

అందాల భామ త్రిష ఇప్పటివరకూ చాలా రకాల సినిమాల్లో నటించింది. కెరీర్ ప్రారంభం నుంచి రీసెంట్ టైం వరకూ కమర్షియల్ మూవీస్ కే ప్రాధాన్యం ఇచ్చిన ఈమె.. కొన్ని నెలల నుంచి రూట్ మార్చేసింది. హారర్ సినిమాలతో భయపెట్టేందుకు కూడా బాగానే ప్రయత్నించింది. ఓ పొలిటికల్ యాంగిల్ ముూవీలో నెగిటివ్ రోల్ లో కూడా మెప్పించేయడం విశేషం.

అక్కడి నుంచి ఈ చెన్నై భామకు వచ్చే ఆఫర్స్ రూట్ మారిపోయింది. విభిన్నమైన కాన్సెప్టులు.. త్రిష ఇప్పటివరకూ టచ్ చేయని సబ్జెక్టులతో ఛాన్సులు వస్తున్నాయి. తాజాగా తనలోని కొత్త యాంగిల్ ను చూపించాలని త్రిష ఫిక్స్ అయిపోయింది. ప్రస్తుతం ఈ భామ 'గర్జనై' అనే కోలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. తమిళనాడులోని యార్కాడ్ సమీపంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఇక్కడ బోలెడన్ని యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరించేస్తున్నారు. త్రిష మొదటిసారిగా యాక్షన్ జోనర్ ను తానే చూపిస్తుండగా.. ఇంత లేటు వయసులో ఇలాంటి ఫీట్స్ ఎందుకో అనే మాటలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.

లేడీ సూపర్ స్టార్ అనిపించుకోవాలనే కోరికను.. కొన్ని నెలల క్రితం ఈ భామ బయట పెట్టిన సంగతి తెలిసిందే. అందుకే.. అన్ని రకాల సినిమాలను చేసేస్తోందట త్రిష. గర్జనై మేకర్స్ అయితే.. త్రిష డేరింగ్ చూసి మెస్మరైజ్ అయిపోతున్నారట. బాడీ డబుల్ అందుబాటులో ఉన్నా కూడా ఉపయోగించుకోకుండా.. తనే రిస్కీ స్టంట్స్ చేయడం చూసి నోరు వెళ్లబెట్టేస్తున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు