కారు కోసం ట్వీటితే అంతిస్తారా?

కారు కోసం ట్వీటితే అంతిస్తారా?

సెలబ్రిటీలు.. స్టార్స్ కు సంపాదన మార్గాలు ఇప్పుడు పెరిగిపోయాయి. గతంలో రెమ్యూనరేషన్ ఒక్కటే ఆధారం. ఆ తర్వాత వాణిజ్య ప్రకటనలు ఎంటర్ అయ్యాయి. కొన్నాళ్లకు రిబ్బన్ కటింగ్స్ వంటివి కూడా ఎక్కువయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ సంపాదన మార్గం ఏంటో తెలుసా.. సోషల్ మీడియా.

అభిమానులకు టచ్ లో ఉంటామంటూ మొదలుపెట్టి.. చివరకు దాన్ని కూడా వ్యాపారం కింద మార్చేస్తున్నారు చాలా మంది. తాప్సీ.. తమన్నా.. కాజల్.. లాంటి హీరోయిన్స్ కొన్నాళ్ల క్రితం వరకూ ఒప్పో ఫోన్స్ కోసం తెగ ట్వీట్స్ పెట్టడం గుర్తే ఉంటుంది. సెల్ఫీ ఫోన్ అంటూ నానా రచ్చా చేయడానికి కారణం.. ఒక్కో ట్వీట్ కు లక్షల కొద్దీ ముట్టడమే. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కార్లు వచ్చి చేరాయి. తాప్సీ ఇలా ఆ కారు చుట్టూ తిరిగేస్తూ తెగ ఫోటోలు పోస్ట్ చేయడానికి రీజన్ అదే. ఒక్కో ట్వీటుకు దాదాపు 5 లక్షల రూపాయలు అందుకుంటోందట ఈ భామ.

ఒక్క తాప్సీనే కాదు.. ఈ జాబితాలో చాలామందే ఉన్నారు. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్.. లోఫర్ భామ దిశా పాట్నీలు కూడా ఈ కార్ల కోసం ట్వీట్స్ పెట్టే లిస్ట్ లో చేరిపోయారు. అందరికీ అంతే మొత్తం గిట్టకపోయినా.. వారి వారి రేంజ్.. ఫాలోయర్స్ ఆధారంగా.. పెద్ద మొత్తాలనే పుచ్చుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు