సెక్సీ అమలను రంగంలోకి దించారు..

సెక్సీ అమలను రంగంలోకి దించారు..

హీరోయిన్‌గా మంచి స్థాయిలో ఉండగా.. ఇంకా బోలెండంత కెరీర్ ఉండగానే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అమలా పాల్. కానీ డైరెక్టర్ విజయ్‌తో ఆమె వివాహ బంధం ఎంతో కాలం కొనసాగలేదు. రెండేళ్లు తిరిగే లోపే ఇద్దరూ విడిపోయారు.

కెరీర్ ఆరంభంలో కొంచెం సెక్సీగా కనిపించిన అమల.. విజయ్‌తో ప్రేమలో ఉన్నపుడు.. అతడిని పెళ్లాడాక ట్రెడిషనల్ లుక్స్‌లోకి మారిపోయింది. ఐతే అతడి నుంచి విడిపోయాక మాత్రం అమల.. గ్లామర్ షో విషయంలో హద్దులేమీ పెట్టుకోవట్లేదు. ఆమె చేస్తున్న హాట్ హాట్ ఫొటో షూట్లు ఎంత చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. తాను నటిస్తున్న సినిమాల్లోనూ హాట్ లుక్స్‌తో ఆకర్షిస్తోంది అమల.

అమల హీరోయిన్‌గా నటించిన కొత్త సినిమా ‘తిరుట్టుపయెలే-2’. ఇది దశాబ్దం కిందట వచ్చిన ‘తిరుట్టుపయెలే’కు సీక్వెల్. అప్పట్లో ఈ సినిమా పెద్ద సంచలనం. పెద్దగా అంచనాల్లేకుండా రిలీజై సంచలన విజయం సాధించింది. తెలుగులోకి కూడా అనువాదమైన ఈ సినిమాలో మాళవిక పాత్ర కుర్రాళ్లకు భలే కిక్కిచ్చింది. ఇప్పుడు ఆమెను మించిన గ్లామర్ డోస్ ఇచ్చేలా ఉంది అమల.

ఈమె నడుం అందాలతో రిలీజ్ చేసిన పోస్టర్లు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి. బాబీ సింహాతో ఆమె ఓ రేంజిలో రొమాన్స్ పండించినట్లుగా ఉంది. ఈ చిత్రాన్ని ‘దొంగోడొచ్చుడు’ పేరుతో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఇది అక్రమ సంబంధాల నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తోంది. ‘మల్లన్న’ సినిమా తీసిన సుశీ గణేషన్ ఈ చిత్రానికి దర్శకుడు. అమలా పాల్‌ను ముందు పెట్టే ఈ చిత్రాన్ని తెలుగులో ప్రమోట్ చేయాలని చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English