నారా బాబు భలే కవర్ చేస్తున్నాడుగా..

నారా బాబు భలే కవర్ చేస్తున్నాడుగా..

నందమూరి అభిమానులు కొన్నేళ్లుగా రెండే వర్గాలుగా విడిపోయి ఉన్న సంగతి తెలిసిందే. ఓ వర్గం బాలయ్యను మాత్రమే అభిమానిస్తే.. ఇంకో వర్గం జూనియర్ ఎన్టీఆర్‌ను మాత్రమే ఆదరిస్తుంది. బాలయ్య, ఎన్టీఆర్ మధ్య అగాథం రోజు రోజుకూ పెరిగిపోతుండగా.. అభిమానుల్లో కూడా దానికి తగ్గట్లే చీలిక పెరిగిపోతోంది. ఐతే ఇవేమీ పట్టించుకోకుండా ఇద్దరినీ కలిపి అభిమానించే వాళ్లూ కూడా పెద్ద సంఖ్యలో ఉన్న మాట కూడా వాస్తవం.

ఐతే నారా వారి ఫ్యామిలీ నుంచి వచ్చిన రోహిత్.. కొన్నేళ్లుగా బాలయ్య వైపే ఉంటూ.. తన మావయ్య సపోర్ట్ బాగానే తీసుకుంటున్నాడు. బావ చంద్రబాబుతో ఉన్న బంధం దృష్ట్యా రోహిత్ నటించిన కొన్ని సినిమాల వేడుకలకు బాలయ్య ముఖ్య అతిథిగా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్‌కు అతను కొంచెం దూరం దూరం ఉంటున్నట్లే కనిపించాడు. ఎక్కడా పెద్దగా ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చేవాడు కాదు రోహిత్.

కానీ ‘బాలకృష్ణుడు’ ఆడియో వేడుకలో మాత్రం ఇటు బాలయ్యను.. అటు ఎన్టీఆర్‌ను ఇద్దరినీ కవర్ చేశాడు. ముందు బాలయ్య పేరెత్తిన ఆయన అభిమానుల్ని ఆకట్టుకున్న నారా రోహిత్.. వెంటనే ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడాడు. అందరం ఒక ఫ్యామిలీ అంటూ అతను అభిమానుల్ని కలిపి ఉంచే ప్రయత్నం చేయడం విశేషం. చివర్లో ‘జై బాలయ్యా’ నినాదంతో అతను ముగించాడు.

మొత్తానికి నందమూరి అభిమానుల్లో అంతరాల్ని తొలగించే ప్రయత్నం ఇంకెవరూ చేయకపోగా.. నారా రోహిత్ ఈ పనికి పూనుకోవడం విశేషం. తనకు మొత్తంగా నందమూరి అభిమానులందరి సపోర్ట్ కావాలని గుర్తించి రోహిత్ ఇలా మాట్లాడాడని తెలుస్తోంది. మొత్తానికి నారా వారబ్బాయి తెలివైనవాడే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు