నారా రోహిత్.. ఇదేం ఫాలోయింగ్ బాబోయ్

నారా రోహిత్.. ఇదేం ఫాలోయింగ్ బాబోయ్

నారా రోహిత్ కొత్త సినిమా ‘బాలకృష్ణుడు’ ఆడియో వేడుక నిన్న రాత్రి జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు వచ్చిన అతిథుల్ని చూసి అందరూ షాకైపోయారు. ఈ మధ్య కాలంలో మరే వేడుకకూ రానంతమంది సెలబ్రెటీలు ఈ వేడుకలో తళుక్కుమన్నారు.

పేరున్న హీరో హీరోయిన్లు.. పెద్ద పెద్ద నిర్మాతలు.. మంచి ఫామ్‌లో ఉన్న దర్శకులు.. ఇలా అన్ని రంగాల నుంచి రెండంకెల సంఖ్యలతో సినీ ప్రముఖుల్ని రప్పించి, తమ సత్తా చాటుకున్నారు నారా రోహిత్ అండ్ కో. ఈ వేడుకకు స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెళ్లయిన తర్వాత సమంత పాల్గొన్న తొలి సినిమా వేడుక ఇదే కావడం విశేషం.

సమంత మాత్రమే కాదు.. ఈ వేడుకలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూ డా ముఖ్య అతిథుల్లో ఒకరిగా హాజరయ్యాడు. ఇంకా రోహిత్ మిత్రుడు నాగశౌర్య, అడివి శేష్ కూడా ఈ వేడుకలో సందడి చేశారు. మరో ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నాతో పాటు అగ్ర నిర్మాతలు దిల్ రాజు, ఎస్.రాధాకృష్ణ, బెల్లంకొండ సురేష్.. దర్శకులు మారుతి, కళ్యాణ్ కృష్ణ.. యాంకర్ టర్న్డ్ యాక్ట్రెస్ అనసూయ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

వీళ్లందరికీ మించి నందమూరి కుటుంబ పెద్ద రామకృష్ణ సైతం చాన్నాళ్ల తర్వాత కనిపించిన వేడుక ఇదే కావడం విశేషం. మొత్తానికి ఇలా చాలా పెద్ద స్థాయిలో అతిథుల్ని పిలిచి ఈ వేడుకకు ఆకర్షణ తీసుకురావడమే కాదు.. తన స్టామినా ఏంటో కూడా చూపించాడు నారా వారి అబ్బాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English