బన్నీ టైమ్‌ బాగా వేస్ట్‌ అవుతోంది

బన్నీ టైమ్‌ బాగా వేస్ట్‌ అవుతోంది

వరుసగా కొన్ని పరాజయాలు చవిచూసిన దశలో జాగ్రత్తపడి చేసిన 'జులాయి'తో అల్లు అర్జున్‌కి కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ దక్కింది. అయితే ఆ వెంటనే ఫామ్‌లో లేని పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో నటించడానికి సాహసించాడు. తనకి కావాల్సినట్టుగా అన్నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఫైనల్‌ ప్రోడక్ట్‌ మాత్రం తాను అనుకున్నట్టుగా రాలేదని బన్నీ డిజప్పాయింట్‌ అయ్యాడట.

జులాయి తర్వాత మరో విజయం వస్తే హీరోగా తనకి ఎంత ప్లస్‌ అనేది బన్నీకి బాగా తెలుసు. అందుకే చాలా కీలకమైన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంపై అతను చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకే ఈ చిత్రానికి చివరి నిముషంలో ప్యాచ్‌ వర్క్‌లు చేస్తున్నారని, ఇంకా షూటింగ్‌ జరుగుతూనే ఉందని ఫిలింనగర్‌ టాక్‌. కారణంగా ఈ చిత్రం రిలీజ్‌ లేట్‌ అవుతూ పోతోంది.

చాలా కాలంగా బాక్సాఫీస్‌ వద్ద చెప్పుకోతగ్గ సినిమా లేక స్లంప్‌ నెలకొంది. ఇద్దరమ్మాయిలతోలాంటి పెద్ద సినిమా రావడానికి ఇదే మంచి తరుణం. కానీ పర్‌ఫెక్షన్‌ పేరిట చాలా టైమ్‌ వేస్ట్‌ అయిపోతోంది. దీని వల్ల సినిమాపై ఉన్న ఆసక్తి కూడా సన్నగిల్లుతోంది. పరిస్థితి చేజారకముందే ఇద్దరమ్మాయిలతో కలిసి బన్నీ వచ్చేస్తాడని ఆశిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు