ఇది మరీ ఓవరమ్మా విజయ్

ఇది మరీ ఓవరమ్మా విజయ్

అర్జున్ రెడ్డి మూవీ తర్వాత విజయ్ దేవరకొండకు దాదాపుగా స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ పాత్రలో ఈ కుర్రాడు నటించిన తీరు.. కుర్రాళ్లకు మతి పోగొట్టేసింది. పైగా టాలీవుడ్ లో ది బెస్ట్ కేరక్టర్లలో ఒకటి.. విజయ్ దేవరకొండ కోసమే ఈ కేరక్టర్.. లాంటి కామెంట్స్ వినిపించడంతో ఈ హీరోలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగానే పెరిగాయి.

రీసెంట్ గా అనుష్క.. త్రివిక్రమ్ శ్రీనివాస్ లు పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ రోజున వారితో ఎప్పటికైనా ఓ సినిమా చేస్తానంటూ.. విజయ్ దేవరకొండ పెట్టిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది. కుర్రాడిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను ఇది చాటుతోందని ప్రశంసలు కూడా గుప్పించారు. ఇప్పుడు మాత్రం ఈ కుర్రాడు చేసిన పని చూసి.. ఇది మరీ ఓవర్ అనేస్తున్నారు జనాలు.

రీసెంట్ గా మహేష్ బాబు సోదరి మంజుల 'ఫాలో యువర్ హార్ట్' అంటూ ఒక షో రీల్ రిలీజ్ చేసింది. మంజులకు బోలెడన్ని ప్రశంసలు దక్కగా.. మనసుకు నచ్చినట్లు చేయండి అన్న కాన్సెప్ట్.. జనాల్లో వైరల్ గా మారింది. దీనికి రియాక్ట్ అయిన విజయ్ దేవరకొండ.. తన మనసు చెప్పినట్లు వింటున్నా అంటూ.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని.. ఇంటికెళ్లి బాగా నిద్రపోతానని చెప్పాడు.

ఎంత మనసుకు నచ్చిన విషయం అయినా.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవడం అంటే ఓవర్ అనే చెప్పాలి. ఎందుకంటే.. అక్కడ నష్టపోయేది నిర్మాత. అలాగే బోలెడంత మంది వర్కర్స్ పని ఇమిడి ఉంటుంది. అవేమీ పట్టించుకోకుండా.. ఫాలో యువర్ హార్ట్ అంటూ షూటింగ్ క్యాన్సిల్ అంటే కరెక్ట్ కాదంటున్నారు జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు