సామాన్యుడి ఎంపీ ఆఫ‌ర్‌కు రాజ‌న్ ఏమ‌న్నారంటే..

సామాన్యుడి ఎంపీ ఆఫ‌ర్‌కు రాజ‌న్ ఏమ‌న్నారంటే..

యూనిర్సిటీలో పాఠాలు చెప్పుకునే పెద్దాయ‌న వద్ద‌కు వెళ్లి.. మిమ్మ‌ల్ని రాజ్య‌స‌భ స‌భ్యుడ్ని చేస్తామంటే..? ఎవ‌రైనా ఏం చేస్తారు? ఎగిరి గంతేస్తారు. ఓకే అనేస్తారు. కానీ.. అందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యారు ర‌ఘురామ్ రాజ‌న్‌. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దిశానిర్దేశించే కీల‌క‌మైన ఆర్ బీఐ గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ఎంపీ ప‌ద‌వి వ‌ద్దంటే వ‌ద్దనేశారు.

సామాన్యుడి పార్టీగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ.. ర‌ఘురామ్‌రాజ‌న్‌ను రాజ్య‌స‌భ‌కు పంపేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆయ‌న ఓకే అన‌ట‌మే ఆల‌స్య‌మ‌ని చెప్ప‌టం తెలిసిందే. రాజ‌న్ ను రాజ్య‌స‌భ‌కు పంపాల‌న్న ఐడియా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డిచింది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం చికాగో యూనివ‌ర్సిటీలో పాఠాలు చెబుతున్నాయ‌న‌.. తాజాగా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు.

నేరుగా ఆయ‌న మాట్లాడ‌కున్నా.. రాజ‌న్ కార్యాల‌యం ఆయ‌న త‌ర‌ఫున ఒక ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌స్తుతం చికాగో యూనివ‌ర్సిటీలో చేస్తున్న ఫుల్ టైమ్ బోధ‌నా ఉద్యోగాన్ని వ‌దిలి వెళ్లాల‌న్న ఆలోచ‌న ఏదీ ప్రొఫెస‌ర్ కు లేద‌ని చెప్పింది. చికాగో వ‌ర్సిటీతో పాటు భార‌త్ లోని వివిధ విద్యా కార్య‌క‌లాపాల్లో ఆయ‌న కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఇత‌ర అంశాల మీద ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఆస‌క్తి లేద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించింది.

అయినా.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు కీల‌క‌మైన ఆర్ బీఐ లాంటి సంస్థ‌కు గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన వ్య‌క్తి.. రాజ్య‌స‌భ స‌భ్యుడి ఆఫ‌ర్ ను ఓకే చేస్తార‌నుకోవ‌టం అత్యాశే అవుతుంది. అందులోకి ర‌ఘురామ్ రాజ‌న్ లాంటి వ్య‌క్తి నుంచి సానుకూల సందేశాన్ని ఆశించ‌లేమ‌న్న‌ది తాజా రియాక్ష‌న్ తో స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు