‘ఫిదా’ ఫీట్ ఎంత గొప్పదో చూశారా?

‘ఫిదా’ ఫీట్ ఎంత గొప్పదో చూశారా?

దసరా కానుకగా విడుదలైన ఎన్టీఆర్ సినిమా ‘జై లవకుశ’ ఈ రోజుతో అర్ధశత దినోత్సవం జరుపుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా ఈ సినిమా ఇంకా ఆడుతోంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ రోజు రాత్రికి స్పెషల్ షోలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.

యావరేజ్ కంటెంట్‌తోనే ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. రూ.73 కోట్ల దాకా షేర్ రాబట్టి.. టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఎక్కువ రేట్లకు అమ్మడం వల్ల సినిమా యావరేజ్ ముద్ర వేయించుకుంది కానీ.. ఇలాంటి యావరేజ్ మూవీతోనూ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో చాటి చెప్పేదే.

హైదరాబాద్ లో సినిమాల అడ్డాగా చెప్పుకునే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ‘జై లకువశ’ 50 రోజులు ఆడటం విశేషం. ఈ రోజు అక్కడ ఉదయం షోల నుంచి ఎన్టీఆర్ అభిమానుల సందడి నెలకొంది. విశేషం ఏంటంటే.. ఇక్కడ ఒక్క థియేటర్లోనే ‘జై లవకుశ’ కోటి రూపాయల గ్రాస్ వసూలు చేస్తోంది. ఈ రోజు రాత్రి షోలతో ఆ మార్కును అందుకుంటుందట ‘జై లవకుశ’. ఒక్క థియేటర్లో కోటి రూపాయల గ్రాస్ అంటే మామూలు విషయం కాదు.

కానీ ఇదే సమయంలో ఇక్కడో విషయం ప్రస్తావించాలి. ‘జై లవకుశ’ కంటే ముందు రిలీజైన ‘ఫిదా’ సినిమా కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ‘సుదర్శన్’ థియేటర్లలో కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దానికి ఎలాంటి స్టార్ కాస్ట్ లేదు. ఎన్టీఆర్ లాంటి స్టార్ సినిమా కోటి రూపాయల గ్రాస్ వసూలు చేయడాన్ని గొప్పగా చెప్పుకుంటున్నపుడు.. ‘ఫిదా’ సినిమా కూడా ఆ మార్కును అందుకోవడం ఇంకెంత గొప్ప ఫీటో కదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు