థియేటర్ కష్టాలపై మంచు మనోజ్ ఆవేదన

థియేటర్ కష్టాలపై మంచు మనోజ్ ఆవేదన

టాలీవుడ్లోని పెద్ద ఫ్యామిలీల్లో మంచు వారి కుటుంబం కూడా ఒకటి. తెలుగు సినిమాల్లో మోహన్ బాబు స్థాయి ఏంటన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు పరిశ్రమలో మంచి పలుకుబడి ఉంది. అయినప్పటికీ ఆయన తనయుడైన మంచు మనోజ్ కూడా తన సినిమా విడుదలకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట.

తన కొత్త సినిమా ‘ఒక్కడు మిగిలాడు’కు థియేటర్ల సమస్య తలెత్తడం వల్లే రిలీజ్ ఆలస్యమైందని.. తన లాంటి హీరో సినిమాకే ఇలాంటి ఇబ్బందులుంటే.. ఇక చిన్న సినిమా సంగతేంటని ప్రశ్నించాడు మనోజ్. ఈ పరిస్థితి మారాలాని అతను అభిలషించాడు. తాను ‘ఒక్కడు మిగిలాడు’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎమోషనల్ కావడానికి.. అంతకుముందు సినిమాలే మానేయాలన్న నిర్ణయానికి రావడానికి ఇలాంటి విషయాలే కారణమని మనోజ్ అన్నాడు.

‘‘చాలామంది కొత్తవాళ్లు.. యువతీయువకులు కలిసి ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా చేశాం. దీంతో మాకు చాలా ఇబ్బందులు తలెత్తాయి. చాలా కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాం. కానీ విడుదలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. థియేటర్ల సమస్య తలెత్తింది. ప్రతి విషయం మమ్మల్ని టెన్షన్ పెట్టింది. చిన్న సినిమాల్ని ఇబ్బంది లేకుండా రిలీజ్ చేసుకోవడానికి ఇండస్ట్రీలో ఒక వ్యవస్థ ఉండాలనిపించింది.

ఇలాంటి ఇబ్బందులన్నీ చూశాక నాకు సినిమాలు వదిలేసి సొసైటీలోకి వెళ్లాలని. పోరాడాలని అనిపించింది. కానీ మా అన్నయ్య నన్ను ఆపి.. వేరే మార్గం సూచించాడు. కొందరు నేను సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్తానని అనుకున్నారు. అలాంటిదేమీ లేదు. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల మీద.. బయట సమస్యల మీద పోరాడాలన్నదే నా అభిమతం’’ అని మనోజ్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English