పాపం సిద్దార్థ్.. ‘గృహం’కు మళ్లీ బ్రేక్

పాపం సిద్దార్థ్.. ‘గృహం’కు మళ్లీ బ్రేక్

ఒకప్పుడు తెలుగులో హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని.. ఆ తర్వాత వరుస ఫ్లాపులు ఎదురవడంతో కోలీవుడ్‌కు వెళ్లిపోయాడు సిద్దార్థ్. ఐతే కొన్నేళ్ల విరామం తర్వాత ‘గృహం’ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశించాడతను. కానీ అతడి ప్రణాళికలు ఫలించట్లేదు.

వారం కిందటే తమిళంతో పాటు.. తెలుగులోనూ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నెల 10న సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయాలని భావిస్తే ఆ ప్రయత్నం కూడా ఫలించట్లేదు. ఈ శుక్రవారం కూడా ‘గృహం’ రిలీజ్ కావట్లేదని సిద్ధు వెల్లడించాడు.

అందరూ థియేటర్లు దొరక్కపోవడం వల్లే ‘గృహం’ తెలుగులో రిలీజ్ కావట్లేదని భావించారు. కానీ సెన్సార్ సమస్యల వల్లే రిలీజ్ లేటవుతోందని సిద్ధు వెల్లడించాడు. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం వల్ల ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయలేకపోతుండటం తనకు బాధ కలిగిస్తోందని.. కనీసం నవంబరు 17న అయినా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని సిద్ధు తెలిపాడు. ఈ మధ్య ‘మెర్శల్’ తెలుగు వెర్షన్ ‘అదిరింది’ కూడా చెన్నైలో సెన్సార్ సమస్యలు ఎదుర్కొంది.

ఐతే ఆ సినిమాలో ఉన్న ఇష్యూలు వేరు. కానీ సిద్ధు సినిమాకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎందుకు తలెత్తుతున్నాయో మరి. ‘గృహం’ తమిళ వెర్షన్ ‘అవల్’కు తమిళనాట మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. ఈ చిత్రం హిందీలో ‘హౌస్ నెక్స్ట్ డోర్’ పేరుతో ఈ శుక్రవారమే రిలీజ్ కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English