బొమ్మరిల్లు బాబే బాగా వీక్

బొమ్మరిల్లు బాబే బాగా వీక్

నవంబర్ నెల అంతా స్మాల్.. మీడియం బడ్జెట్ మూవీస్ సందడి కనిపించననుందని ఇఫ్పటికే పలుమార్లు చెప్పుకున్నాం. ఈ శుక్రవారం కోసం అయితే.. ఏకంగా నాలుగు సినిమాలు క్యూ కట్టేశాయి. డైరెక్ట్ సినిమాలకు పోటీగా తమిళ్ డబ్బింగ్ మూవీస్ కూడా వచ్చేస్తున్నాయి.

మంచు మనోజ్ నటించిన ఒక్కడు మిగిలాడు.. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన కేరాఫ్ సూర్య చిత్రాలు నవంబర్ 10న విడుదల కానున్నాయి. అదే రోజున విశాల్ మూవీ తుప్పరివాలన్ డబ్బింగ్ వెర్షన్ డిటెక్టివ్ కూడా విడుదల అవుతోంది. మరోవైపు నవంబర్ 9నే విజయ్ మూవీ మెర్సల్ తెలుగు వెర్షన్ అదిరింది రిలీజ్ కానుంది. వీటిలో మంచు మనోజ్ కు మాస్ ఫోలోయింగ్ ఉంది.

మెర్సల్ చుట్టూ నెలకొన్న వివాదాలు ఈ సినిమాకు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. యంగ్ హీరో సందీప్ కిషన్ కి టాలీవుడ్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. మరోవైపు.. విశాల్ కి మాస్ లో ఫాలోయింగ్ ఎక్కువ. కాకపోతే.. ఆ తర్వాత వారం విడుదల అయేందుకు షెడ్యుల్ అయిన సినిమాల్లో సిద్ధార్ధ్ నటించిన గృహం ఉంది. స్వాతి నటించిన లండన్ బాబులు కూడా నవంబర్ 17నే వస్తోంది.

కానీ సిద్ధార్ధ్ బాబు సినిమాకు మాత్రం ఎటువైపు నుంచి సపోర్ట్ వస్తుందంటే చెప్పడం చాలా కష్టమైన విషయం. టాలీవుడ్ లో తన ఇమేజ్ ను చేతులారా పోగొట్టుకున్న తర్వాత.. మళ్లీ బౌన్స్ బ్యాక్ అవలేకపోయిన సిద్ధార్ధ్.. ఇప్పుడు కంటెంట్ తో ఆకట్టుకుంటే మాత్రమే సినిమా ఆడే అవకాశం ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English