ఎవరిని కవ్వించడానికి అమలా??

ఎవరిని కవ్వించడానికి అమలా??

అమలా పాల్.. బోలెడంత ట్యాలెంట్ ఉన్న భామామణి. కెరీర్ ప్రారంభంలోనే మంచి సక్సెస్ లు మాత్రమే కాదు.. పలు అవార్డులు రివార్డులు కూడా పట్టేసింది. తన ట్యాలెంట్ ను ప్రత్యేకంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఈ భామకు ఎప్పుడూ రాలేదు. సౌత్ మొత్తంలో అన్ని భాషల్లోనూ సినిమాలు చేసేసి తన ట్యాలెంట్ బాగానే చూపించేసింది.

అయితే.. తన భర్తతో విడాకుల వ్యవహారంతో ఈ ఏడాది వార్తల్లో బాగా నానిన అమలా పాల్.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వచ్చేసింది. తన లైఫ్ లో డిస్టర్బింగ్ స్టేజ్ ఎదురైనా.. సినిమాలతో దాన్ని ఓవర్ కమ్ చేసేందుకు బాగానే ప్రయత్నిస్తోంది. అయితే.. ఈ ప్రయత్నాలు ఇప్పుడు కాసింత ఎక్కువయ్యాయనే చెప్పాలి. ప్రస్తుతం అమలా పాల్ హాట్ హాట్ సీన్స్ లో కూడా నటించేందుకు రెడీ అయిపోతోంది. అందుకు తగినట్లుగా తన బాడీ తీరును కూడా మార్చేసుకుంటోందని.. రీసెంట్ గా ఈ భామ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు చూస్తే అర్ధమవుతుంది. వర్కవుట్స్ తో జిమ్ లో బాగా కష్టపడుతున్న అమలా పాల్.. ఫిజిక్ ను మార్చుకుని గ్లామర్ యాంగిల్ లోకి వచ్చేందుకు ట్రై చేస్తోందనే సంగతి తాజా పోస్టర్స్ చెబుతున్నాయి.

యాక్టింగ్ టాలెంట్ ఉన్న అమ్మాయే అయినా.. సడన్ గా ఇలా  ఓవర్ గ్లామరస్ గా ఎందుకు చేస్తోంది? ఇండస్ట్రీలో ఎవరికన్నా తన సత్తా ఏంటో చూపించాలనా? ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ కారణం అయిన వాళ్లకు తన ట్యాలెంట్ ను చూపించే ప్రయత్నం చేస్తోందా.. అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు