సల్మాన్.. మాస్.. ఊర మాస్

సల్మాన్.. మాస్.. ఊర మాస్

‘ట్యూబ్ లైట్’ సినిమా సల్మాన్ ఖాన్‌ను పెద్ద దెబ్బే కొట్టింది. ‘భజరంగి భాయిజాన్’.. ‘సుల్తాన్’ లాంటి క్లాస్ టచ్ ఉన్న.. మంచి కథలున్న సినిమాలతో భారీ విజయాన్నందుకున్న సల్మాన్.. అదే స్టయిల్లో ‘ట్యూబ్ లైట్’ చేశాడు. కానీ ఈసారి దారుణమైన ఫలితం వచ్చింది. దీంతో సల్లూ భాయ్ రూటు మార్చేశాడు. ఈసారి ఊర మాస్ సినిమాతో వచ్చేస్తున్నాడు.

అదే.. ‘టైగర్ జిందా హై’. బాలీవుడ్లో మాస్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ హీరోయిజం హై లెవెల్లో ఉండేలా చూసుకుని సినిమాలు చేసే హీరోల్లో సల్మాన్ ముందుంటాడు. హిందీ మాస్ ప్రేక్షకులకు సల్మాన్ ను మించిన ఎంటర్టైనర్ కనిపించడు. సల్మాన్ ఖాన్ సినిమాలు గతంలో చాలా ఈజీగా వంద కోట్ల మార్కు అందుకోవడానికి అతడికి మాస్‌లో ఉన్న ఫాలోయింగే కారణం.

‘టైగర్ జిందా హై’ ట్రైలర్ చూస్తే మాస్ ప్రేక్షకుల్ని అలరించడానికే ఈ సినిమా చేసినట్లుగా ఉంది సల్మాన్. ఒక పెద్ద సమస్య తలెత్తినపుడు.. ఆ సమస్యను ఎవరూ పరిష్కరించలేనపుడు.. రక్షకుడిలా రావడం మాస్ హీరో లక్షణం. ‘టైగర్ జిందా హై’లో సల్మాన్ పాత్ అచ్చంగా అలాంటిదే. ఉగ్రవాదులు ఇరాక్‌లో 25 మంది భారతీయ నర్సుల్ని కిడ్నాప్ చేస్తే.. వాళ్లను కాపాడే దిక్కు తెలియని సమయంలో టైగర్ రంగంలోకి దిగుతాడు. ఉగ్రవాదుల అడ్డాకు వెళ్లిపోయి, వాళ్లలో ఒకడిగా ఉంటూ ఈ నర్సుల్ని హీరో కాపాడేస్తాడు.

ఈ క్రమంలో ఉగ్రవాదులు ఇంకా పెద్ద ముప్పు తలపెడతారు. యుద్ధానికి సిద్ధమవుతారు. అప్పుడు హీరో వాళ్ల ప్లాన్లను ఛేదించి అందరినీ ఎలా మట్టుబెట్టాస్తాడన్నది కథ. ట్రైలర్ అంతా కూడా భారీతనంతో.. యాక్షన్ సన్నివేశాలతో మాస్ ప్రేక్షకుల్ని అలరించేలాగే కనిపించింది. చాన్నాళ్ల తర్వాత సల్మాన్.. అతడి మాజీ ప్రేయసి కత్రినా కలిసి నటిస్తున్న సినిమా ఇది. ‘సుల్తాన్’ దర్శకుడ అలీ అబ్బాస్ జాఫర్ రూపొందించిన ఈ చిత్రాన్ని ‘యశ్ రాజ్ ఫిలిమ్స్’ ప్రొడ్యూస్ చేసింది. డిసెంబరు 22న ‘టైగర్ జిందా హై’ ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English