కుర్ర‌పిల్ల‌తో డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ న‌టుడు

కుర్ర‌పిల్ల‌తో డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ న‌టుడు

అర‌వైఏళ్ల ముసలోడు మ‌హా హాట్ అంటూ కుర్ర‌పిల్ల వెంట ప‌డ‌టం.. ల‌వ్వూ.. ల‌వ్వూ అనేయ‌టం.. మొద‌ట సుముఖంగా లేకున్నా.. త‌ర్వాత ఓకే అన‌టం లాంటి క‌థ‌ల‌తో వ‌చ్చిన సినిమాలు చూశాం. ఇప్పుడు చెప్పేది రీల్ క‌థ కాదు రియ‌ల్‌క‌థ‌. బాలీవుడ్ న‌టుడు మిలింద్ సోమ‌న్ గుర్తున్నాడా?

యంగ్ గా ఉన్న‌ప్పుడు మ‌హా హాట్ అన్న పేరున్న ఇత‌గాడికి ఇప్పుడు 52 ఏళ్లు. అయితే.. ఇంత వ‌య‌సు వ‌చ్చినా సినిమాల్లో మాదిరి ఇత‌డి ప‌ట్ల ఆక‌ర్షితురాలైంది ప‌ద్దెనిమిదేళ్ల చిన్న‌ది అంకిత‌. ఈ అమ్మ‌డు ఎయిర్ హోస్టెస్ గా ప‌ని చేస్తోంది. ఎక్క‌డ ఎలా క‌నెక్ట్ అయ్యార‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. తాజాగా త‌న టీనేజ్ గాళ్ ఫ్రెండ్ తో నార్వే ట్రిప్ వేశాడు మిలింద్‌. త‌న 52 బ‌ర్త్ డేను గాళ్ ఫ్రెండ్ తో  ఘ‌నంగా జ‌రుపుకున్న అత‌గాడు.. అందుకు సంబంధించిన ఫోటోల్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌టంతో ఎప్ప‌టిలానే సోష‌ల్ మీడియా త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఇద్ద‌రి మ‌ధ్య 30 ఏళ్ల గ్యాప్ పెట్టుకొని ఈ ప్రేమ‌లేంట‌ని కొంద‌రు మండిప‌డితే.. కూతురు వ‌య‌సున్న అమ్మాయితో ప్రేమాయ‌ణ‌మా? ఇదేం ప‌ద్ద‌తంటూ దుమ్మెత్తిపోశారు. తిట్ల‌తో పాటు వీరి లవ్వాట‌పై జోకులు వేస్తున్నోళ్లు లేక‌పోలేదు. 18 ఏళ్ల అమ్మాయి 51 ఏళ్ల మిలింద్ తో డేటింగ్ చేస్తోంది. . బేటీ ప‌డావో.. బేటీకో మిలింద్ సోమ‌న్ సే బ‌చావో ప‌థ‌కాన్ని మోడీ అర్జెంట్ గా స్టార్ట్ చేయాలంటూ జోకేశారు.

ఇలా తిట్టేవాళ్లు తిట్టేయ‌టం.. జోకులేసేవాళ్లు జోకులేసేయ‌టం ఒక ఎత్తు అయితే.. అత‌గాడికి మ‌ద్ద‌తుగా నిలిచే వారూ లేక‌పోలేదు. మిలింద్‌కు మ‌ద్ద‌తుగా ర‌చ‌యిత భావ‌న ఆరోరా ట్వీట్ చూస్తూ.. 50 ఏళ్లు వ‌చ్చినా మిలింద్ ఇంకా హాట్ గానే ఉన్నాడు.. ఇప్ప‌టికైనా ఆన్ లైన్ ట్రోలింగ్ ఆపాల‌ని ఆమె చెబుతున్నారు. న‌చ్చే వాళ్లు న‌చ్చిన‌ట్లుగా.. న‌చ్చ‌నోళ్లు న‌చ్చ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం సోష‌ల్ మీడియాలో కామ‌నే. కానీ.. ఎంత‌వ‌ర‌క‌న్న‌దే అస‌లు ఇష్యూ. దీన్ని ప‌ట్టించుకునే వాళ్లు ఎవ‌రున్నారు. ఎవ‌రికి వారు.. త‌మ భావ‌స్వేచ్ఛ అంటూ త‌మ భావాల్ని చెప్పేయ‌ట‌మే. ఈ ముచ్చ‌ట‌ను ప‌క్క‌న పెడితే.. రీల్ మాదిరి రియ‌ల్ ల‌వ్ ట్రాక్ ఇప్పుడు ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు