పక్కలోకి రమ్మంటారు.. కాని మమ్మల్ని అడగలేదు

పక్కలోకి రమ్మంటారు.. కాని మమ్మల్ని అడగలేదు

క్యాస్టింగ్ కౌచ్.. ఇప్పుడు ప్రతీ హీరోయిన్ నోటి వెంటా దీని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తోంది. కొందరు తమకు తామే చెబుతుంటే.. మరికొందరు మాత్రం మీడియా అడిగినపుడు నోరు విప్పుతున్నారు. తెలుగులో సింపుల్ గా చెప్పాలంటే.. నీకు అవకాశం ఇస్తాను.. మరి నువ్వు నా పక్కలోకి రా.. అనడమే ఈ క్యాస్టింగ్ కౌచ్ అంటే. ఓ రకంగా ఇది కూడా లైంగిక వేధింపులనే చెప్పాలి.

ఇక చాలామంది హీరోయిన్లు చెబుతున్న మాట.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కల్చర్ ఉందనే అంటున్నారు. అలాగని తాము ఈ పరిస్థితిని ఫేస్ చేశామని ఒప్పుకుంటున్న వారి కౌంట్ చూస్తే.. వేళ్ల మీద లెక్క పెట్టేంత కూడా లేదు. తనను ఓ స్టార్ హీరో బెడ్ రూమ్ కి రమ్మన్నాడంటూ కొన్ని నెలల క్రితం రాధికా ఆప్టే చెప్పడం మినహాయిస్తే.. తాము ఎదుర్కొన్నామని చెప్పినోళ్లు కనిపించడం లేదు. కానీ దాదాపుగా అందరూ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కల్చర్ ఉందని.. అవకాశాల పేరిట అమ్మాయిలను ఉపయోగించుకోవడం జరుగుతోందని.. జరగొచ్చని అంటున్నారు. రీసెంట్ గా శ్రద్ధా దాస్ కూడా అదే తరహాలో చెప్పింది. ఆ కల్చర్ ఉంది.. కాని నేను ప్రొఫెషనల్ కావడం వలన ఫేస్ చేయలేదు అనేసింది.

అయితే ఇండస్ట్రీలో ఈ కల్చర్ ఉందని ఎలా చెబుతున్నారు వీళ్ళంతా? తమకు మాత్రం ఎదురుకాలేదని.. తమను ఎవరూ అలా చూడలేదని.. పిలవలేదని చెబుతూనే.. ఆ కల్చర్ ఉందీ అనడం తప్పు కాదా? పరిశ్రమలో ఇంతగా ఉన్న కల్చర్.. వీరెవరికీ ఎదురు కాలేదంటే అది ఆశ్చర్యపోవాల్సిన విషయమే. మరి ఎవరికీ ఎదురు కాని కల్చర్.. అసలు నిజంగానే ఉందా మరి? పక్కలోకి రమ్మంటారు అని ఈ భామలే చెబుతున్నారు..కాని మమ్మల్ని అడగలేదు అని కూడా అంటున్నారు. ఏంటో ఈ చోద్యం!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English