రంగస్థలంలో బ్రాండింగ్ కూడానా?

రంగస్థలంలో బ్రాండింగ్ కూడానా?

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ రంగస్థలం 1985. వచ్చే ఏడాది మార్చి చివరి వారంలో ఈ మూవీ రూపొందుతుండగా.. చెర్రీ-సమంత మొదటిసారిగా ఈ సినిమా కోసం జత కడుతున్నారు. అయితే.. ఈ మూవీ 1980ల నాటి బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే.

రంగస్థలం అంటే మొదట్లో అదేదో నాటకాలకు సంబంధించిన మ్యాటర్ అనుకున్నారు కానీ.. రీసెంట్ గా రిలీజ్ చేసిన పిక్చర్స్ ను బట్టి.. ఇదో గ్రామం పేరు అనే సంగతి రివీల్ చేసేశారు. సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కానీ.. షూటింగ్ ప్రోగ్రెస్ సంగతులు కానీ బయటకు రావడం లేదు. అయితే.. షూటింగ్ స్పాట్ కి సంబంధించిన కొన్ని పిక్స్ మాత్రం వస్తున్నాయి. రీసెంట్ గా బయటకు వచ్చిన పిక్స్ ను పరిశీలిస్తే.. ఓ జాతరకు సంబంధించిన ఫోటోలో.. నంది పైపులు అంటూ ఓ స్టాల్ కి బ్యానర్ లాంటిది కనిపిస్తుంది. అప్పట్లో నంది పైపులు.. చార్మినార్ రేకులు .. ఎరువుల కంపెనీల ప్రకటనలు ఎక్కడికి వెళ్లినా కనిపించేవి.

వీటిలో కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా పెద్ద కంపెనీలుగా కూడా మారాయి. అప్పటి ప్రకటనలను ఇప్పుడు కూడా సినిమాలోనే బ్రాండింగ్ గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మరి లొకేషన్ ను రియల్ గా చూపించడానికి ఇలాంటివి ఉపయోగిస్తున్నారో.. లేక నిజంగానే ఇన్ ఫిలిం బ్రాండింగ్ చేస్తున్నారో మాత్రం క్లియర్ గా చెప్పలేం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు