‘రంగస్థలం’కు పదిన్నర కోట్లు

‘రంగస్థలం’కు పదిన్నర కోట్లు

గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల మార్కెట్ బాగా విస్తరించింది. ఓవైపు శాటిలైట్ హక్కులు.. మరోవైపు ఓవర్సీస్ హక్కులు మంచి రేటు పలుకుతూ గతంతో పోలిస్తే నిర్మాతలకు ఆదాయాన్ని పెంచాయి. వీటికి తోడు కొత్తగా హిందీ డబ్బింగ్ హక్కులు.. డిజిటల్ రైట్స్ రూపంలో కొత్త ఆదాయాలు సమకూరుతున్నాయి. మన దగ్గర అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా హిందీలో డబ్ అయి అక్కడి టీవీ ఛానెళ్లలో మంచి ఆదరణ పొందుతుండటం విశేషం. అలాగే అమేజాన్ ప్రైమ్.. హాట్ స్టార్ లాంటివి డిజిటల్ హక్కులకు మంచి మంచి రేట్లు ఇస్తున్నాయి. దీంతో పెద్ద సినిమాల పంట పండుతోంది. కొన్ని నెలల కిందట రిలీజైన అల్లు అర్జున్ సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ హిందీ డబ్బింగ్ హక్కులు రూ.9 కోట్ల దాకా పలికినట్లు వార్తలొచ్చాయి.

ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ‘రంగస్థలం’కు హిందీ డబ్బింగ్ హక్కుల రూపంలో ఏకంగా రూ.10.5 కోట్లు ముట్టాయట. ఇది చాలా పెద్ద డీల్ అనే చెప్పాలి. కొన్నేళ్ల కిందటి వరకు హిందీ డబ్బింగ్‌కు అసలు విలువే ఉండేది కాదు. ఇప్పుడు ఆయాచితంగా డబ్బులొచ్చి పడుతున్నాయి. మరోవైపు రామ్ చరణ్-సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ‘రంగస్థలం’ శాటిటైల్, డిజిటల్ హక్కులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. మాటీవీ వాళ్లు శాటిలైట్, అమేజాన్ ప్రైజ్ వాళ్లు డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్నట్లు సమాచారం. రెండూ కలిపి రూ.20 కోట్ల దాకా వర్కవుట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ఓవర్సీస్ హక్కుల కోసం కూడా మాంచి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మార్చి 29న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు