పనిమనిషి పాత్రలకు చాలామంది రెడీ

పనిమనిషి పాత్రలకు చాలామంది రెడీ

పని మనిషి రోల్.. ఈ పాత్రలను చేసేందుకు యాక్టర్స్ అంతగా ఉత్సాహం చూపరు. కొందరు మాత్రమే ఈ రోల్స్ కు పరిమితం అయిపోగా.. ఇలాంటి రోల్స్ మనం చేసేదేంటి అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. కానీ ఇలాంటి వాటికి ఇప్పుడు దాదాపుగా చెక్ పడిపోయింది. ఇందుకు కారణం ఒకే ఒక్క సినిమా అంటే ఆశ్చర్యం వేయక మానదు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అఆ మూవీలో హరితేజ రోల్ సంగతి తెలిసిందే. ఆ మూవీ అంతా అంతటా ఉంటూ.. అలరించిన పాత్ర అది.  అఆ సినిమాలో ఆ ఒక్క పనమ్మాయ్ పాత్ర సూపర్బ్ గా క్లిక్ అయ్యింది. హరితేజకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఈ భామ లైఫ్ కంప్లీట్ గా మారిపోయింది. ఆ మూవీ వెంటే.. బిగ్ బాస్ అవకాశం అందింది. దాన్ని కూడా ఈమె పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంది. దెబ్బకు.. టివి హోస్టగా ప్రోగ్రామ్స్ కూడా చేతికి వచ్చేశాయి. ఇప్పుడీమె లైఫ్ కంప్లీట్ గా మారిపోయింది. ఇప్పుడైతే అమెరికా ట్రిప్పులలో  హరితేజ ఇలా ఎంజాయ్ చేస్తోంది. ఒక పాత్ర ఒక జీవితాన్నే మార్చేయడం అంటే హరితేజను చూసి అర్ధం చేసుకోవచ్చు.

అందుకే ఇప్పుడు చాలామంది ఆ పాత్రల కోసం ఎగబడుతున్నారు. సినిమాలో కీలకంగా ఉండాలే కానీ.. ఎలాంటి పాత్రలకైనా సిద్ధం అంటూ చాలామంది నుంచి దర్శక నిర్మాతలకు సంకేతాలు వెళుతున్నాయి. త్వరలో ఇలాంటి పాత్రలలో బాగా ఫేమ్ ఉన్న యాక్టర్స్ ను కూడా చూసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు