ఆ కమెడియన్ పై సన్నీ కేసు పెట్టదా?

ఆ కమెడియన్ పై సన్నీ కేసు పెట్టదా?

సినిమాకు క్రేజ్ సంపాదించి పెట్టడంలో టైటిల్ ది కీలక పాత్ర. అందుకే క్యాచీ టైటిల్స్ కోసం తెగ పాకులాడుతారు మేకర్స్. ఇక పక్కనోళ్ల పేర్లను వాడుకుని సినిమా టైటిల్స్ పెట్టేసుకునేందుకు కూడా చాలా మంది తెగించేస్తుంటారు.

ఇప్పుడు కమెడియన్ నుంచి హీరోగా మారిన సప్తగిరి.. హీరోగా తన మొదటి రెండు సినిమాల టైటిల్స్ లోను సప్తగిరి ఉండేలా చూసుకుని ఆశ్చర్యపరిచాడు. అలాగే ఇప్పుడు సప్తగిరి వెడ్స్ సన్నీ లియోన్ అంటూ తన మూడో సినిమాకు పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. నిజంగా ఈ టైటిల్ చాలా క్యాచీగా ఉంది. కానీ.. ఈ పేరు పెట్టడం నిజంగా సాధ్యమేనా అనిపించక మానదు.

ఎందుకంటే సన్నీ అంటే ఇప్పుడు ఓ పేరు మాత్రమే కాదు.. ఓ బ్రాండ్ కూడా. ఒకవేళ నిజంగానే మనోడు కనుక.. 'సప్తగిరి వెడ్స్ సన్నీ లియోన్' అని పెడితే.. జస్ట్ ఆమె పేరుతో అలా బ్రాండింగ్ చేసుకుంటున్నందుకు.. సన్నీకి బ్రాండింగ్ పేరిట భారీగా ముట్టచెప్పాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. తన సొంత పేరును ప్రతీ సినిమాకు తగిలించినంత ఈజీ కాదు ఆ విషయం అన్నది మాత్రం నిజమే. టైటిల్ పై సన్నీ కేసు పెట్టే వరకూ వెళ్లినా ఆశ్చర్యం లేదనే టాక్ వినిపిస్తోంది.

ఇక ఇలాంటివే ఇతర సినిమాలను పరిశీలిస్తే.. గతంలో సూపర్ స్టార్ కిడ్నాప్ అంటూ మహేష్ బాబు ను కిడ్నాప్ చేసే ప్లాట్ తో ఓ సినిమా తీశారు. ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి అంటూ ప్రభాస్ క్రేజ్ ను.. ప్రభాస్ పెళ్లిపై వార్తలను కూడా తమ సినిమా కోసం వాడారు మేకర్స్. అవేవీ అంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు సప్తగిరి వెడ్స్ సన్నీ లియోన్ సంగతేంటో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు