విక్రమ్ సినిమా ముంచేసిందన్న ఆ దర్శకుడు

విక్రమ్ సినిమా ముంచేసిందన్న ఆ దర్శకుడు

తమిళ దర్శకుడు సుశీంద్రన్‌కు తమిళంలో చాలా మంచి పేరుంది. ‘నా పేరు శివ’ సినిమాతో తెలుగులోనూ పేరు తెచ్చుకున్నాడు సుశీంద్రన్. అంతకుముందు తెలుగులోకి రీమేక్ అయిన ‘భీమిలి కబడ్డీ జట్టు’ ఒరిజినల్ డైరెక్టర్ కూడా అతనే. విశాల్ హీరోగా వచ్చిన ‘జయసూర్య’ కూడా అతడి సినిమానే.

ఈ నెల 10న విడుదల కాబోతున్న సందీప్ కిషన్ సినిమా ‘కేరాఫ్ సూర్య’ తీసింది సుశీంద్రనే. ఐతే చాలా వరకు చిన్న.. మీడియం రేంజి హీరోలతోనే సినిమాలు చేసిన సుశీంద్రన్.. గతంలో విక్రమ్ హీరోగా ‘రాజాపట్టై’ అనే భారీ బడ్జెట్ మూవీ తీశాడు. తెలుగులో ఆ సినిమా ‘వీడింతే’ పేరుతో రిలీజైంది. ఆ సినిమా అప్పట్లో పెద్ద ఫ్లాప్ అయింది.

దీని వల్ల తన కెరీర్ చాలా దెబ్బ తిందని.. దాన్నుంచి కోలుకోవడానికి చాలా ఏళ్లు పట్టిందని చెప్పాడు సుశీంద్రన్. ‘‘ఆ సినిమా ఫ్లాప్ అయినందుకు నేను ఎవరినీ నిందించను. కానీ ఆ సినిమా మొదలైన తొలి రోజు నుంచి నాకు సమస్యలు మొదలయ్యాయి. ఆ సినిమా నాకు చాలా పెద్ద పాఠాలే నేర్పించింది. ఒక పెద్ద హీరోతో ఫ్లాప్ సినిమా తీస్తే పరిణామాలు ఎలా ఉంటాయో నాకు అప్పుడర్థమైంది.

ఆ సినిమా వల్ల దాదాపుగా నేను ఫినిష్ అయిపోయాను. అంతకుముందు నేను కమిటైన సినిమాలు ఆగిపోయాయి. నేను సొంతంగా నా సినిమాల్ని ప్రొడ్యూస్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ స్క్రిప్టులు రాసుకోవాల్సి వచ్చింది. మళ్లీ నేను నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది’’ అని సుశీంద్రన్ తెలిపాడు. సందీప్‌తో సుశీంద్రన్ చేసిన ‘కేరాఫ్ సూర్య’ మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English