తమాషా చూస్తున్న ‘2.0’ మేకర్స్

తమాషా చూస్తున్న ‘2.0’ మేకర్స్

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసే సినిమా ఒకటి వస్తోందంటే.. ఆ సమయంలో వేరే సినిమాలేవీ రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఈ ఏడాది ‘బాహుబలి: కంక్లూజన్’ రిలీజైనపుడు అదే జరిగింది. ఆ సినిమా రిలీజైన నెల రోజుల పాటు పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాలేదు.

తెలుగు వరకే కాదు.. తమిళం, హిందీలోనూ అదే పరిస్థితి. ఐతే ‘బాహుబలి’ రిలీజ్ డేట్ చాలా ముందుగానే ప్రకటించడం వల్ల అందుకు తగ్గట్లుగా మిగతా సినిమాలను షెడ్యూల్ చేసుకున్నారు. ఇలాంటి సినిమాల రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత ఇవ్వడం అన్నది నిర్మాతల బాధ్యత.

ఐతే ‘బాహుబలి’ తర్వాత అంతటి అంచనాలున్న సినిమా ‘2.0’ రిలీజ్ విషయంలో ఆ చిత్ర నిర్మాతలు మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. ముందు దీపావళి విడుదల అని చెప్పి.. ఆ తర్వాత జనవరి 25కు వాయిదా వేశారు నిర్మాతలు. ఆ డేట్ పక్కా అనుకుంటుండగా వారం కిందట ఈ చిత్రం వేసవికి వాయిదా పడిందని వార్తలొచ్చాయి. ఏప్రిల్ 13న తమిళ సంవత్సరాది సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లుగా చెప్పుకున్నారు. దీంత ఒక్కసారిగా కలకలం రేగింది.

ఆ డేట్ పక్కా అయితే.. ఏప్రిల్‌కు షెడ్యూల్ అయిన సినిమాల డేట్లన్నీ మార్చుకోవాలి. జనవరి సినిమాల్లోనూ మార్పులుంటాయి. దీంతో ఇటు తెలుగులో.. అటు తమిళంలో నిర్మాతల్లో గందరగోళం మొదలైంది. ఐతే ‘2.0’ వాయిదా పడిందా లేదా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. నిర్మాతలు తమకేమీ పట్టనట్లు సైలెంటుగా ఉన్నారు. ఒకవేళ వాయిదా లేకుంటే.. ఆ విషయం స్పష్టం చేయాలి. లేదా డేట్ మారుతుంటే.. ఆ విషయాన్ని ధ్రువీకరించాలి. కానీ వాళ్లు మాత్రం ఏమీ స్పందించట్లేదు. మరోవైపు వేరే నిర్మాతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మరి ఇంకెన్నాళ్లు ‘2.0’ మేకర్స్ సైలెంటుగా ఉంటారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English