ఐసీయూలో దర్శకుడు.. హీరోయిన్‌కు సీరియస్

ఐసీయూలో దర్శకుడు.. హీరోయిన్‌కు సీరియస్

తన కెరీర్లో ‘ఒక్కడు మిగిలాడు’కు కష్టపడ్డట్లు ఏ సినిమాకూ కష్టపడలేదని మంచు మనోజ్ తెలిపాడు. ఈ సినిమాకు తాను మాత్రమే కాదని.. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారని.. ప్రాణాలు పెట్టి పని చేశారని మనోజ్ తెలిపాడు. తమ కుటుంబ సభ్యుల్ని వదిలేసి 60 రోజుల పాటు సముద్రంలోనే ఉండి షూటింగ్ చేయడమంటే మాటలు కాదని.. ఆ సమయంలో యూనిట్లో కొందరికి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తాయని మనోజ్ తెలిపాడు.

‘ఒక్కడు మిగిలాడు’ షూటింగ్ సందర్భంగా దర్శకుడు అజయ్ నూతక్కికి పక్కటెముక విరిగిందని.. దీంతో అతడిని ఐసీయూలో ఉంచి చికిత్ చేయాల్సి వచ్చిందని మనోజ్ తెలిపాడు. అలాగే ఇందులో కీలక పాత్ర చేసిన జెన్నిఫర్ అనే అమ్మాయికి చాలా సీరియస్ అయిందని.. సముద్రం నుంచి గట్టుకు తీసుకొచ్చే లోపు పరిస్థితి విషమంగా తయారైందని మనోజ్ వెల్లడించాడు.

ఇక ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టం గురించి కూడా మనోజ్ వివరించాడు. తనకు షోల్డర్ ఇంజురీ.. నెక్ ఇంజురీ ఉన్నాయని.. తన కండరాలు పటిష్టంగా ఉన్నపుడు నొప్పి రాదని.. కానీ అవి లూజ్ అయితే విపరీతమైన నొప్పి ఉంటుందని.. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఈ సినిమా కోసం బరువు పెరగడం.. తగ్గడం చేశానని మనోజ్ తెలిపాడు. ఒకసారి బరువు పెరిగాక మళ్లీ తగ్గడం చాలా కష్టమైందని అతను చెప్పాడు. ఈ కష్టానికి ఫలితం ఈ నెల 10న దక్కుతుందని మనోజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English