అడివి శేషూ.. ఇది మరీ ఎక్కువేమో!!

అడివి శేషూ.. ఇది మరీ ఎక్కువేమో!!

అడివి శేష్ కు ఎన్నేసి ట్యాలెంట్స్ ఉన్నాయనే సంగతి ఇప్పటికే జనాలకు తెలుసు. అటు డైరెక్టర్ గా.. రైటర్ గా.. విలన్ గా.. రీసెంట్ గా క్షణం మూవీలో హీరోగా కూడా మెప్పించేశాడు. ఇక ఇతగాడి రైటింగ్ ట్యాలెంట్ సంగతి గురించి కూడా తెలిసిన విషయమే.

ఇప్పుడు అడివి శేష్ ఓ కొత్త సినిమాలో చేస్తున్నాడు. ఇప్పుడీ మూవీకి సంబంధించిన ఓ లుక్ రిలీజ్ చేశారు. సినిమా టైటిల్ గూఢచారి. టైటిల్ తోనే కాన్సెప్ట్ చెప్పేయగా.. పోస్టర్ లో అద్దంలోంచి దూసుకుపోతున్న బుల్లెట్.. గన్ ట్రిగ్గర్ పై వేలు పెట్టి నుంచున్న అడివి శేష్ కనిపిస్తారు. అంతా బాగానే ఉంది కానీ.. ఓ మూవీని ప్రమోట్ చేసుకునేందుకు సహజంగా దర్శకుల పేరును వాడుకోవడం చూస్తుంటాం.

కానీ గూఢచారి పోస్టర్ చూస్తే మాత్రం.. అడివి శేష్ కు భజన కనిపిస్తుంది. ఫ్రం ది రైటర్ ఆఫ్ క్షణం అంటూ టైటిల్ కి పైన ఓ వైపు ప్రింట్ చేశారు. మరోవైపు అడివి శేష్ ఇన్ అండ్ యాజ్ గూఢచారి అని రాసిన తర్వాత.. మళ్లీ ఆ స్టోరీ రాసినది కూడా హీరోనే అని చెప్పడమే ఇక్కడ కాన్సెప్ట్. అంటే తన సినిమాకు తనే కథ రాసుకున్నాడంతే.

పైగా బడ్జెట్ తో పోల్చితే హిట్ అనిపించుకున్న క్షణం మూవీని.. ఓ ఆస్కార్ విన్నింగ్ మూవీ అనో.. బాహుబలి రేంజ్ సక్సెస్ అనో.. కొత్త చరిత్ర లిఖించిన చిత్రంగానే అడివి శేష్ భావిస్తున్నాడంటూ ఈ పోస్టర్ ను చూసిన నెటిజన్స్ నుంచి బోలెడన్ని కామెంట్స్ వస్తున్నాయి. అయినా తనను తాను ప్రమోట్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. కంటెంట్ బేస్డ్ గా సినిమాకు ప్రచారం చేస్తే కాస్త బాగుంటుందేమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు