‘స్పైడర్’ ఫెయిల్యూర్‌పై రకుల్ ఏమందంటే..

‘స్పైడర్’ ఫెయిల్యూర్‌పై రకుల్ ఏమందంటే..

మహేష్ బాబుతో కలిసి నటించాలని రకుల్ ప్రీత్ సింగ్ కొన్నేళ్ల నుంచి కలలు కంటోంది. ‘బ్రహ్మోత్సవం’లో నటించే ఛాన్స్ వచ్చినా.. ఆ సమయానికి డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో అవకాశం పోయింది. మరోవైపు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌తో పని చేయాలన్నది కూడా ఆమె కల.

ఐతే ఈ రెండు కలలూ ఆమెకు ‘స్పైడర్’ సినిమాతో ఒకేసారి నెరవేరాయి. కానీ ఈ సినిమా చేస్తున్నన్ని రోజుల్లో ఆనందంలో మునిగి తేలుతూ.. మీడియాను కలిసినపుడు కూడా చాలా ఎగ్జైటెడ్‌గా కనిపించిన రకుల్‌.. రిలీజ్ తర్వాత ఆనందమంతా ఆవిరైపోయింది. ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకని, డిజాస్టర్ అయింది.

దీంతో రకుల్ రిలీజ్ తర్వాత ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఐతే తన కొత్త సినిమా ‘ఖాకి’ ప్రమోషన్ల కోసం మళ్లీ మీడియా ముందుకొచ్చిన రకుల్‌కు ‘స్పైడర్’కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో స్పందించక తప్పలేదు. "అన్ని సార్లూ మనం అనుకున్నవి జరగవు. మన ప్రయత్నం మనం చేస్తాం. కానీ ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం. నా వరకు ప్రతి సినిమాకూ వంద శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ‘స్పైడర్’ విషయంలోనూ అదే చేశాను" అంటూ వేదాంతం మాట్లాడింది రకుల్. ప్రస్తుతం రకుల్ ఆశలన్నీ ‘ఖాకి’ మీదే ఉన్నాయి.

కార్తి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని వినోద్ రూపొందించాడు. ఈ చిత్రం ఈ నెల 17న తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు