మంచు మనోజ్ ఒక్కడు ఒకవైపు..

మంచు మనోజ్ ఒక్కడు ఒకవైపు..

ఈ శుక్రవారం ఒకటికి మూడు సినిమాలు రిలీజయ్యాయి. ఈ వారమే కాదు.. ఈ నెలంతా ప్రతివారం కనీసం రెండు మూడు సినిమాలు రిలీజయ్యేులా ఉన్నాయి. వచ్చే వారానికి ఏకంగా ఐదు సినిమాలు షెడ్యూల్ అయి ఉండటం విశేషం. చిత్రమైన విషయం ఏంటంటే.. ఇందులో స్ట్రెయిట్ తెలుగు సినిమా ఒక్కటే. అదే.. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఒక్కడు మిగిలాడు’. చాన్నాళ్లుగా విడుదల కోసం చూస్తున్న ఈ చిత్రానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. రిలీజ్ డేట్ ఫిక్సయ్యాక అగ్రెసివ్‌గా ప్రమోషన్లు చేస్తోంది చిత్ర బృందం.

ఇక వచ్చే వారాంతంలో రాబోయే మిగతా నాలుగు సినిమాలూ తమిళ డబ్బింగ్‌వే కావడం విశేషం. అందులో ముందుగా గురువారం విజయ్ సినిమా ‘అదిరింది’ రిలీజవుతుంది. దీపావళికే రావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు నవంబరు 9కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆ తర్వాతి రోజు సందీప్ కిషన్ సినిమా ‘కేరాఫ్ సూర్య’ రిలీజవుతుంది.

ఆ సినిమా అదే రోజు తమిళంలోనూ రిలీజ్ కానుంది. ఇక ఈ శుక్రవారానికే రావాల్సి ఉన్నా.. థియేటర్లు దొరక్క ఆలస్యమైన సిద్దార్థ్ సినిమా ‘గృహం’ను వచ్చే శుక్రవారం రిలీజ్ చేయబోతున్నారు. సిద్ధునే ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఈ చిత్రం తమిళంలో మంచి టాక్ తెచ్చుకుంది. మరోవైపు గత నెలలో రిలీజై తమిళంలో సూపర్ హిట్టయిన విశాల్ సినిమా ‘తుప్పారివాలన్’.. పదో తారీఖున తెలుగులో ‘డిటెక్టివ్’గా విడుదల కాబోతోంది. మొత్తానికి మంచు మనోజ్ మూవీ వెర్సస్ తమిళ డబ్బింగ్ సినిమాలన్నమాట వచ్చే వారాంతంలో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English