మణిరత్నం హీరోయిన్ని పట్టిన బాబు

మణిరత్నం హీరోయిన్ని పట్టిన  బాబు

‘భలే మంచి రోజు’ తర్వాత సుధీర్ బాబు కెరీర్లో చాలా గ్యాప్ వచ్చేసింది. రెండేళ్ల పాటు సోలో హీరోగా అతడి సినిమాయే లేదు. కొన్ని నెలల కిందట ‘శమంతకమణి’ లాంటి మల్టీస్టారర్ చేశాడు కానీ.. అది అంత మంచి ఫలితాన్నివ్వలేదు. ఐతే సుధీర్ బాబు ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాలు కమిటై ఉండటం విశేషం. ఆ ఐదు సినిమాల విశేషాలు నిన్న సుధీర్ ట్విట్టర్లో పంచుకున్నాడు. అందులో ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లో రాబోతున్న మూవీ ఉంది.

‘జెంటిల్‌మన్’.. ‘అమీతుమీ’ సినిమాలతో రెండు వరుస హిట్లు కొట్టిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని ‘జెంటిల్‌మన్’ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తాడు. ఈ చిత్రంలో మణిరత్నం సినిమా ‘చెలియా’లో కథానాయికగా నటించిన బాలీవుడ్ భామ అదితి రావు హైదరి కథానాయికగా నటించబోతుండటం విశేషం.

ఇది కాక రాజశేఖర్ కొత్త దర్శకుడితో సొంత నిర్మాణంలో ఓ సినిమా.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో పుల్లెల గోపీచంద్ బయోపిక్.. నారా రోహిత్ కాంబినేషన్లో చేస్తున్న ‘వీరభోగ వసంతరాయలు’ సినిమాలు ఉన్నాయి సుధీర్ చేతుల్లో. అలాగే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో దర్శకుడిగా పరిచయం కాబోతున్న హర్షవర్ధన్‌ తోనూ సుధీర్ బాబు ఓ సినిమా కమిటయ్యాడు. ఈ ఐదు సినిమాల్లో కనీసం నాలుగు వచ్చే ఏడాదే విడుదల కాబోతుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు