సెలెబ్స్ ఐఫోన్ ఎక్స్ పిచ్చిని చూశారా!!

సెలెబ్స్ ఐఫోన్ ఎక్స్ పిచ్చిని చూశారా!!

ప్రపంచంలో ఏ కొత్త ఫోన్ లాంఛ్ కు లేనంత హంగామా ఐఫోన్ కొత్త వెర్షన్ రిలీజ్ సమయంలో మాత్రం క్రియేట్ అవుతుంది. ఒకట్రెండు వారాలు గడిస్తే కోరిన అందరికీ ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తుందని తెలిసినా.. తామే ముందు కొనుగోలు చేసి.. ఐఫోన్ తో పిక్ తీసి సోషల్ మీడియాలో పెట్టేందుకు సామాన్య జనాలే కాదు.. సెలబ్రిటీలు స్టార్లు కూడా తెగ ఉత్సాహం చూపిస్తారు.

మన దేశంలో ఇవాళే ఐఫోన్ ఎక్స్ లాంఛ్. 10వ వార్షికోత్సవానికి గుర్తుగా ఈ మోడల్ ను యాపిల్ కంపెనీ లాంఛ్ చేయగా.. మన దేశంలో ఇవాల్టి నుంచే అమ్మకాలు ప్రారంభించారు. ఇప్పుడు జనాల చేతుల్లో ఐఫోన్ ఎక్స్ సందడి చేస్తోంది. సెలబ్రిటీల నుంచి ఐఫోన్ ఎక్స్ సీల్డ్ బాక్స్ లకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్ లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. హీరో అభిషేక్ బచ్చన్.. నవలా రచయిత చేతన్ భగత్ లు ఇలాంటి ఫోటోలను నెట్ లో పోస్ట్ చేసి.. తమ ఐఫోన్ ఎక్స్ చేతికి అందిందనే విషయాన్ని వెల్లడించారు. మరి కాసేపు గడిస్తే ఇలాంటి ఫోటోలు స్టార్స్ నుంచి చాలానే వచ్చేస్తాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

జనాల్లో కూడా ఈ ఐఫోన్ ఎక్స్ పిచ్చి పీక్ స్టేజ్ లోనే ఉంది. ముంబైకు చెందిన ఓ వ్యక్తి తను ఐ లవ్ ఐఫోన్ ఎక్స్ అంటూ ఓ ప్లకార్డ్ పట్టుకుని.. గుర్రం మీద ఐఫోన్ స్టోర్ కు వెళ్లిన పిక్ వైరల్ అయిపోయింది. ఇంకా ఐఫోన్ ఎక్స్ పిచ్చిలో ఎన్నెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English