జిందగీ క్యాలుకులేషన్ ఎక్కడ దెబ్బతింది?

జిందగీ క్యాలుకులేషన్ ఎక్కడ దెబ్బతింది?

ఉన్నది ఒకటే జిందగీ.. గతవారం విడుదలైన ఈ చిత్రానికి టాక్ యావరేజ్ గానే వచ్చింది. అయితే.. టాక్ కు మించిన ఓపెనింగ్స్ రావడం మాత్రం విశేషంగానే చెప్పాలి. రామ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం.. ఇప్పుడు ఫ్లాప్ దిశగా జర్నీ చేస్తోంది.

తొలి వారం అంతా ముగిసేసరికి వచ్చిన కలెక్షన్స్ 13 కోట్లకు కొంచెం ఎక్కువ అంతే. ఇందులో తొలి మూడు రోజుల్లోనే వచ్చిన మొత్తం 10.8 కోట్లు. అంటే మిగిలిన నాలుగు రోజులు కలిపి కూడా.. తొలి మూడు రోజుల్లో వచ్చిన ఏ ఒక్క రోజు మొత్తానికి సమానం కాదు. తొలి వీకెండ్ జోరు చూసి.. రామ్ ఖాతాలో హిట్టు పడిపోయినట్లే అని వేసిన అంచనాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం.. మూవీని సరిగ్గా ప్రమోట్ చేయకపోవడమే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హిట్టు కాంబో.. రిలీజ్ కి ముందే క్రేజ్.. కుర్రాళ్లను టార్గెట్ చేసిన కంటెంట్.. వీటన్నిటినీ బేస్ చేసుకుని.. మన సినిమాను అందరూ చూసేస్తారులే అనుకుని అంతగా ప్రమోట్ చేయలేదు.

ఈ మధ్యకాలంలో సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా ప్రమోషన్లు ఘనంగా ఉంటే మాత్రం కలక్షన్లు వచ్చేస్తున్నాయి. టాక్ యావరేజ్ గా ఉండి.. ప్రమోషన్లు చేయకపోతే.. పరిస్థితి ఎలా ఉంటుందో.. ఉన్నది ఒకటే జిందగీ చిత్రం స్పష్టంగా తెలియచెప్పింది. అసలు తొలి వీకెండ్ తర్వాత.. ప్రమోషన్స్ నిలిపివేయడానికి కారణం ఏంటో మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు