దంగల్ పిల్ల ప్లేస్ లో తాప్సీ!

దంగల్ పిల్ల ప్లేస్ లో తాప్సీ!

ప్రస్తుతం బాలీవుడ్ లో ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను టైం బాగానే పరుగులు పెడుతోంది. టాలీవుడ్ లో అడపా దడపా నోరు పారేసుకుంటున్నా.. ఇక్కడ కూడా ఆనందో బ్రహ్మ అంటూ మంచి హిట్ నే అందుకుంది. అటు బాలీవుడ్ లో పింక్ తో గుర్తింపు పొంది.. రీసెంట్ గా జుడ్వా2 అంటూ భారీ హిట్ ను కూడా ఖాతాలో వేసుకుంది.

ఇటు పెర్ఫామెన్స్.. అటు కమర్షియల్ హిట్స్ ఖాతాలో ఉండడంతో.. వరుస అవకాశాలు తాప్సీ చేతికి అందుతున్నాయి. ఇప్పటి వరకూ తను స్టార్ అనిపించుకోలేకపోయానంటూ ఈ మధ్యనే అసహనం వెళ్లగక్కిన ఈ భామకు.. ఛాన్సులు మాత్రం బాగానే అందుతున్నాయి. తాజాగా ఈ భామ చేతికి ఓ క్రేజీ ప్రాజెక్టు అందిందనే టాక్ వినిపిస్తోంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందనున్న లేటెస్ట్ మూవీ కోసం ఈ భామను సంప్రదించారట.

నిజానికి ఈ పాత్రను మొదట దంగల్ భామ సాన్యా మల్హోత్రాకు ఆఫర్ చేశారు. కానీ ఇప్పుడీ ఛాన్స్ తాప్సీ పన్ను ముంగిట వాలిందని తెలుస్తోంది. రీసెంట్ గానే స్టోరీ.. డేట్స్ పై డిస్కషన్స్ కూడా జరగగా.. ఇంకా ఈ మూవీ చేయడంపై తాప్సీ తుది నిర్ణయం తీసుకోలేదు.

అయితే..ఆనంద్ ఎల్ రాయ్ వంటి నిర్మాత రూపొందించే ఈ చిత్రంలో తాప్సీ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరి కొన్ని రోజుల్లోనే ఈ ప్రాజెక్టులోకి తాప్సీ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English