మెహ్రీన్.. డోస్ పెంచినట్లుందే

మెహ్రీన్.. డోస్ పెంచినట్లుందే

టాలీవుడ్లో ఇప్పుడు మాంచి ఊపుమీదున్న హీరోయిన్ ఎవరంటే.. మరో మాట లేకుండా మెహ్రీన్ కౌర్ పేరు చెప్పేయొచ్చు. తొలి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో మంచి విజయాన్నందుకున్న మెహ్రీన్.. ఇటీవలే మూడు వారాల వ్యవధిలో ‘మహానుభావుడు’.. ‘రాజా ది గ్రేట్’ లాంటి సక్సెస్‌లతో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. ఆమె ఇంకో వారం రోజుల్లో ‘కేరాఫ్ సూర్య’తో పలకరించబోతోంది. ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రామిసింగ్‌గా ఉండటంతో ఇదీ కూడా సక్సెస్ కావచ్చన్న అంచనాలున్నాయి. దీని తర్వాత ఇంకో మూడు వారాల తర్వాత ‘జవాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మెహ్రీన్.

ఐతే ఇప్పటిదాకా చేసిన మూడు సినిమాల్లో కానీ.. వచ్చే వారం రాబోయే ‘కేరాఫ్ సూర్య’లో కానీ మెహ్రీన్ కొంచెం పద్ధతిగానే కనిపించింది. తనలోని గ్లామర్ కోణం చూపించలేదు. కానీ ‘జవాన్’లో మాత్రం ఆమెలోని మరో యాంగిల్ చూపించబోతున్నట్లుంది. ఈ రోజు ఈ ఈ చిత్ర బృందం రిలీజ్ చేసిన ‘బుగ్గంచున...’ పాట చూస్తే ఆ ఫీలింగే కలుగుతోంది. ఈ పాటలో శారీలో చాలా సెక్సీగా కనిపిస్తోంది మెహ్రీన్. ఆమె లుక్స్.. ఎక్స్‌ప్రెషన్స్ కూడా అందుకు తగ్గట్లే ఉన్నాయి. ఈ పాటలో ఊరికే ఫొటోలు మాత్రమే చూపించారు. దానికే కుర్రాళ్లలో వేడి పుట్టింది. ఇక వీడియో సాంగ్ చూస్తే వాళ్లకు మరింత కిక్కు ఖాయమనిపిస్తోంది. హ్యాట్రిక్ హిట్లతో జోరు మీదున్న మెహ్రీన్ మామూలుగానే ఈ సినిమాకు ఆకర్షణ కాగా.. ఆమె గ్లామరస్‌గా కనిపిస్తుండటం సినిమాకు మరింత కలిసొచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు