మహేష్‌ని సీరియస్‌గా తీసుకున్న దిల్‌ రాజు

మహేష్‌ని సీరియస్‌గా తీసుకున్న దిల్‌ రాజు

దిల్‌ రాజు బ్యానర్లో చాలా హిట్లున్నాయి కానీ పెద్ద హీరోలతో మర్చిపోలేని భారీ విజయాలని మాత్రం ఇవ్వలేకపోయాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు, బృందావనం లాంటి మామూలు హిట్లయితే ఇచ్చాడు కానీ బొమ్మరిల్లు, ఫిదాల మాదిరిగా పెద్ద హీరోలకి బ్లాక్‌బస్టర్లు ఇవ్వలేకపోయాడు. డిజె కూడా హిట్‌ కాకపోవడంతో దిల్‌ రాజుకి అగ్ర హీరోలతో భారీ విజయాలు తీయలేడనే ముద్ర ఇంకాస్త బలపడిపోయింది.

దీంతో మహేష్‌ ఇరవై అయిదవ చిత్రాన్ని దిల్‌ రాజు చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి అశ్వనీదత్‌ కూడా నిర్మాణ భాగస్వామి. అశ్వనీదత్‌కి చేయాల్సిన సినిమానే మహేష్‌ చెప్పడంతో దిల్‌ రాజుని కూడా పార్టనర్‌గా చేర్చుకున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూషన్‌ మొత్తం రాజు ఆధ్వర్యంలో జరుగుతుందట. ఈ చిత్రం మొదలు కావడానికి చాలా సమయం వున్నప్పటికీ ప్రీ ప్రొడక్షన్‌ పనులన్నీ పూర్తి చేసేసి, మహేష్‌ 'భరత్‌ అనే నేను' షూటింగ్‌ ముగించుకునే సరికి సెట్స్‌ మీదకి వెళ్లేలా దిల్‌ రాజు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

మామూలుగా డేట్లు దొరకని దేవిశ్రీప్రసాద్‌ని ముందే బుక్‌ చేసి, విదేశాలకి పంపించి మరీ పాటల రికార్డింగ్‌ చేయించుకుంటున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం కోసం మూడు ట్యూన్లు రెడీ అయిపోయాయి. మార్చిలో మొదలు పెట్టి అక్టోబరులో సినిమా రిలీజ్‌ చేసేలా పక్కా ప్రణాళిక వేసుకుని మరీ సెట్స్‌ మీదకి వెళ్లబోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు