రకుల్‌ బిజినెస్‌ అదరహో!

రకుల్‌ బిజినెస్‌ అదరహో!

హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి ఈమధ్య టైమ్‌ కలిసి రావడం లేదు కానీ బిజినెస్‌ పరంగా మాత్రం ఆమె భలేగా రాణిస్తోంది. హీరోయిన్లు అందరూ హోటల్‌ లేదా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇన్వెస్ట్‌ చేస్తూ వుంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాత్రం వేరే రూట్‌ ఎంచుకుంది. ఫిట్‌నెస్‌ని అమితంగా ఇష్టపడే రకుల్‌ ఒక విలాసవంతమైన ఫిట్‌నెస్‌ స్టూడియోని లాంఛ్‌ చేసింది.

అది చాలా పెద్ద హిట్‌ అవడంతో ఆంధ్రప్రదేశ్‌కి కూడా దానిని విస్తరించింది. తాజాగా కోకాపేటలో మరో పెద్ద బ్రాంచ్‌ ఓపెన్‌ చేసింది. సెలబ్రిటీలు స్టార్ట్‌ చేసే ఫిట్‌నెస్‌ స్టూడియోలు సామాన్యులకి అందుబాటులో వుండవు. కానీ రకుల్‌ తన సంస్థని అందరికీ అందుబాటులో వుండేలా ప్లాన్‌ చేసుకుంది.

త్వరలోనే చెన్నయ్‌, ముంబయ్‌లో కూడా బ్రాంచ్‌లు ఓపెన్‌ చేయాలని డిసైడ్‌ అయిందట. వేరే వ్యాపారాల మీద కూడా ఆసక్తి వున్నప్పటికీ తన ఫిట్‌నెస్‌ స్టూడియోని ఇండియాలో టాప్‌ 10 బెస్ట్‌ ఫిట్‌నెస్‌ స్టూడియోల్లో ఒకటిగా నిలిపిన తర్వాతే వేరేవి చేయాలని చూస్తోంది. ఇక హీరోయిన్‌గా ఆమె నటించిన ఖాకీ చిత్రం త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతానికి చేతిలో చెప్పుకోతగ్గ ఆఫర్లు లేకపోయినా మళ్లీ తన టైమ్‌ స్టార్ట్‌ అవుతుందని ఆమె ధీమాగా వుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English