స్పైడర్‌ ప్రొడ్యూసర్‌కి చరణ్‌ సపోర్ట్‌!

స్పైడర్‌ ప్రొడ్యూసర్‌కి చరణ్‌ సపోర్ట్‌!

సీడెడ్‌లో టాప్‌ డిస్ట్రిబ్యూటర్‌ అయిన ఎన్వీ ప్రసాద్‌ అడపాదడపా భారీ చిత్రాలని నిర్మిస్తుంటారు. మెగా ఫ్యామిలీతో సత్సంబంధాలు వున్న ఈయన ఇటీవల స్పైడర్‌ చిత్రాన్ని నిర్మించారు. అరవై కోట్లకి పైగా నష్టాన్ని చవిచూసిన ఈ చిత్రం ఎన్వీ ప్రసాద్‌ రెప్యుటేషన్‌ని దెబ్బ తీసింది. బయ్యర్ల నుంచి పెట్టుబడి తిరిగివ్వాలనే డిమాండ్లు అధికమవుతున్నాయి.

ప్రస్తుతం చాలా ఒత్తిడిలో వున్న ప్రసాద్‌కి రామ్‌ చరణ్‌ ఒక సినిమా చేసి పెడతానని మాటిచ్చాడట. రచ్చతో పాటు ధృవ చిత్రాన్ని ప్రసాద్‌ భాగస్వామ్యంలో చేసిన రామ్‌ చరణ్‌ తను చేసే కొరటాల శివ తర్వాతి చిత్రాన్ని ఈయనకి చేయాలని డిసైడ్‌ అయ్యాడట. ఇంకా దర్శకుడు ఎవరనేది కన్‌ఫర్మ్‌ కాలేదు కానీ ప్రసాద్‌ బ్యానర్లో చరణ్‌ సినిమా వుందనే సరికి స్పైడర్‌ బయ్యర్లు కాస్త ఒత్తిడి తగ్గిస్తారు.

తమకి ఈ చిత్రం తక్కువ రేట్లకి లభిస్తుందని సైలెంట్‌ అవుతారు. ఇదిలావుంటే స్పైడర్‌ చిత్రం అంత బ్యాడ్‌గా తయారవడానికి కారకుడైన మురుగదాస్‌ తన పారితోషికంలోంచి కాస్త కూడా వెనక్కి ఇవ్వడానికి ససేమీరా అన్నాడట. తన తదుపరి చిత్రాన్ని తమిళ హీరో విజయ్‌తో చేయబోతున్న మురుగదాస్‌ ఆ సినిమా పనుల్లో బిజీ అయిపోయి స్పైడర్‌ని పూర్తిగా మర్చిపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English