ఫ్లాప్‌ అమ్మా... ఫ్లాపే ఈ బొమ్మ!

ఫ్లాప్‌ అమ్మా... ఫ్లాపే ఈ బొమ్మ!

మొదటి మూడు రోజుల వసూళ్లు చూసి కాలర్లు ఎగరేయడం ఈమధ్య కామన్‌ అయిపోయింది. అయితే ఆదివారం నుంచి సోమవారానికి పాతిక శాతానికి పడిపోతున్న వసూళ్లతో సినిమాల అసలు స్వరూపం నాలుగో రోజుకే తేలిపోతోంది. రాజుగారి గది 2 తర్వాత సోమవారం నుంచి దారుణంగా పడిపోయిన సినిమా 'ఉన్నది ఒకటే జిందగీ'.

మూడు రోజుల పాటు నిలకడగా మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం సోమవారం నుంచి పడిపోతూనే వుంది. సోమవారం డ్రాప్‌ చాలా ఎక్కువ అనుకుంటే కనీసం ఆ వసూళ్లని కూడా స్టడీగా మెయింటైన్‌ చేయలేకపోతోంది. సెకండ్‌ వీకెండ్‌ తర్వాత ఈ చిత్రం పూర్తిగా పడిపోతుందనే సంకేతాలు బలంగా అందుతూ వుండడంతో ఇది ఫ్లాప్‌ అని ట్రేడ్‌ తేల్చేసింది. అసలే ఈ వీకెండ్‌లో కొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం గరుడవేగ, నెక్స్‌ట్‌ నువ్వే తదితర చిత్రాలున్నాయి.

నేను శైలజలాంటి మరో హిట్‌ ఇవ్వడం కోసం రామ్‌, కిషోర్‌ తిరుమల కలిసి తీసిన 'ఉన్నది ఒకటే జిందగీ' మరీ తొంభైల నాటి కథాంశంతో నీరసం తెప్పించింది. యువతరాన్ని ఆకట్టుకుంటుందని, ఫ్రెండ్‌షిప్‌ పేరిట వారిని ఉర్రూతలూగిస్తుందని మేకర్లు భావించారు కానీ సీన్‌ రివర్స్‌ అయింది. చాలా చిత్రాలు వదిలేసుకుని రామ్‌ చేసిన ఈ చిత్రం అతడి అంచనాలని తలకిందులు చేసేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు