తెలుగు క్వీన్ లో స్పోర్ట్స్ యాంకర్

తెలుగు క్వీన్ లో స్పోర్ట్స్ యాంకర్

బాలీవుడ్ లో బంపర్ హిట్ అయిన క్వీన్ మూవీని సౌత్ లోని నాలుగు భాషల్లో నలుగురు భామలతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. హిందీలో లీసా హేడెన్ పోషించిన పాత్రను నాలుగు భాషల్లోనూ అమీ జాక్సన్ తో నటింపచేయాలని భావించారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు అమీ జాక్సన్ తేల్చేసింది.

క్రియేటివ్ డిఫరెన్సులతో పాటు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో తప్పుకుంటున్నా అన్నది అమీ వెర్షన్. ఇప్పుడీమె స్థానాన్ని మరో ఇద్దరు నటీమణులతో రీప్లేస్ చేసినట్లు నిర్మాతలు అఫీషియల్ గా వెల్లడించారు. తెలుగులో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న క్వీన్ రీమేక్ లో.. లీసా పాత్రను షిబాని దండేకర్ తో చేయించనున్నట్లు తెలిపారు. అటు వీజేగాను.. ఐపీఎల్ మ్యాచ్ లలో యాంకర్ గాను షిబాని సుపరిచితురాలే. కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించి మెప్పించిన ఈమెను.. ఇప్పుడు టాలీవుడ్ కు తీసుకువస్తున్నారు. తెలుగుతో పాటు మలయాళ వెర్షన్ క్వీన్ లో కూడా షిబాని దండేకర్ నే ఈ పాత్రకు తీసుకోవడం విశేషం.

మరో వైపు.. కన్నడ.. తమిళ వెర్షన్స్ కోసం ఎల్లి ఆరామ్ ను తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. క్రియేటివ్ డిఫరెన్స్ లతో తప్పుకుంటున్నట్లు అమీ జాక్సన్ చెప్పడం శోచనీయం అన్నది వీరి వాదన. అసలు ఇప్పటివరకూ నాలుగు వెర్షన్స్ కు గాను.. కనీసం ఇద్దరు నిర్మాతలను కూడా అమీ కలవలేదట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English