మెగా ఫ్యామిలీ.. ఏ పండుగనీ వదలట్లేదు

మెగా ఫ్యామిలీ.. ఏ పండుగనీ వదలట్లేదు

ఓ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం సాధారణమే. అదే పండుగలను సెలబ్రిటీలు సెలబ్రేట్ చేసుకునే విధానం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. దాదాపుగా అన్ని సెలబ్రిటీ ఫ్యామిలీస్ లోనూ ఇంటిల్లిపాది కలిసి పండుగలను జరుపుకునే కల్చర్ ఉంటుంది. కానీ ఈ విషయంలో మెగా ఫ్యామిలీ రూటే వేరు అని చెప్పాలి.

మెగా ఫ్యామిలీలో సెలబ్రిటీల కౌంట్ ఎక్కువ. అందుకే ఒక పండుగను వీరు జరుపుకోవడమే కాదు.. దాన్ని జనాలకు చూపించే విధానం మరింత వెరిైటీగా ఉంటుంది. తాజాగా అందరూ హాలోవీన్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలో కూడా ఇది కనిపించింది. అయితే.. రామ్ చరణ్ భార్య ఉపాసన.. ఓ ఫోటో పోస్ట్ చేసి హాలోవీన్ సందర్భంగా ఇలా భయపెట్టేలా తయారైన వ్యక్తి ఎవరో చెప్పాలంటూ పజిల్ విసిరింది. దీనికి జనాల నుంచి చాలానే రియాక్షన్స్ వచ్చేశాయి. అక్కడ కనిపిస్తున్న వ్యక్తి రామ్ చరణ్ సోదరుడు వరుణ్ తేజ్ అనే సంగతి జనాలు కనిపెట్టేశారు. అధే విషయాన్ని ట్వీట్స్ ద్వారా చెప్పుకొచ్చారు.

ఇలా ఓ స్పెషల్ ఫెస్టివల్ ను తాము సెలబ్రేట్ చేసుకున్న విధానాన్ని పజిల్ టైపులో జనాలకు ఉపాసన చెప్పిన విధానం ఆకట్టుకుంది. ఈ ఒక్క పండుగను మాత్రమే కాదు.. న్యూ ఇయర్ నుంచి మొదలు క్రిస్మస్ వరకూ.. దాదాపు ప్రతీ పండుగను ఫ్యామిలీ అంతా కలిపి జరుపుకుంటూ ఉంటారు మెగా టీం. ఇక హాలోవీన్ గెటప్ లో అల్లు అర్జున్ కుమారుడు అయాన్ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు