‘క్వీన్’ రీమేక్.. మళ్లీ ట్విస్టు

‘క్వీన్’ రీమేక్.. మళ్లీ ట్విస్టు

ఎప్పుడో మూడేళ్ల కిందట రిలీజైంది ‘క్వీన్’ సినిమా. ఆ సినిమా రిలీజైన కొన్ని నెలలకే సౌత్ రీమేక్ హక్కుల్ని కొన్నాడు తమిళ నటుడు.. నిర్మాత త్యాగరాజన్. నటీనటులు.. టెక్నీషియన్ల ఎంపికలో మార్పులు చేర్పులతో చూస్తుండగానే మూడేళ్లు గడిచిపోయాయి. చివరికి అందరినీ ఫైనలైజ్ చేసి నాలుగు భాషల్లో ఈ మధ్యే నాలుగు భాషల్లో వేర్వేరుగా సినిమాను మొదలుపెట్టారు.

కానీ అంతా ఓకే అనుకుంటుండగా మళ్లీ ఇప్పుడు ఈ సినిమాలకు బ్రేక్ పడేట్లు కనిపిస్తోంది. హిందీలో లిసా హేడెన్ పోషించిన పాత్రకు తెలుగు.. తమిళ భాషల్లో అమీ జాక్సన్‌ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా షూటింగ్ ఆరంభించే సమయానికి సడెన్ గా అమీ ఈ సినిమా నుంచి తప్పుకుంది.

ఆమె ఓ ఇంగ్లిష్ వెబ్ సిరీస్ కు కమిట్మెంట్ ఇవ్వగా.. దాని వల్ల ‘క్వీన్’ సినిమాకు డేట్లు కేటాయించే విషయంలో ఇబ్బంది ఎదురైంది. తనకు ఆ వెబ్ సిరీసే ముఖ్యమనుకున్న అమీ.. ‘క్వీన్’ టీంకు టాటా చెప్పేసింది. అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేసిందట. దీంతో మళ్లీ ఇప్పుడు ఆ పాత్ర కోసం నటిని వెతికే పనిలో పడింది చిత్ర బృందం.

తెలుగులో తమన్నా కథానాయికగా ‘క్వీన్’ పేరుతో.. తమిళంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ‘పారిస్ పారిస్’ పేరుతో సినిమాల్ని మొదలుపెట్టారు. ఈ రెండు వెర్షన్లకూ నీలకంఠనే దర్శకుడు. కన్నడ-మలయాళ వెర్షన్లకు రమేష్ అరవింద్ డైరెక్టర్. కన్నడలో పారుల్ యాదవ్.. మలయాళంలో మాంజిమా మోహన్ కథానాయికలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English