‘2.0’ రిలీజ్ డేట్‌.. మళ్లీ ట్విస్టు?

‘2.0’ రిలీజ్ డేట్‌.. మళ్లీ ట్విస్టు?

రెండు మూడు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం బఫ్స్ అందరూ ‘2.0’ రిలీజ్ డేట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాను జనవరి 25 నుంచి ఏప్రిల్ 13కు వాయిదా వేసినట్లుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇది జనవరిలో రిలీజయ్యే సినిమాలకు ఊరటనివ్వగా.. ఏప్రిల్‌కు షెడ్యూల్ అయిన సినిమాల నిర్మాతల్లో మాత్రం గుబులు రేపింది.

ఐతే ‘2.0’ వాయిదా పడ్డట్లు మీడియాలో వార్తలొచ్చాయి తప్ప.. చిత్ర బృందం నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా లేదు. వాళ్ల మౌనం అర్ధాంగీకారం అనుకున్నారు కానీ.. అసలు ఈ సినిమాను వాయిదా వేసే ఆలోచనే నిర్మాతలకు లేదంటూ ఇప్పుడొస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

మూడు రోజుల కిందట ‘2.0’ వాయిదా పడ్డట్లుగా ట్వీట్ చేసిన ప్రముఖ తమిళ క్రిటిక్ శ్రీధర్ పిళ్లై స్వయంగా ఇప్పుడు వాయిదా లేకపోవచ్చని అంటున్నారు. ‘2.0’ మేకర్స్ జనవరి 25కే సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారని.. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారని ఆయన నిన్న ట్వీట్ చేశారు.

శ్రీధర్ పిళ్లై క్రెడిబిలిటీ ఉన్న క్రిటిక్. ఆయన చెప్పారంటే ఇందులో వాస్తవం లేకుండా పోదు. రిలీజ్ డేట్ మారిందని చెప్పింది కూడా ఆయనే అయినప్పటికీ.. ఆయన చేసిన తాజా ట్వీట్‌ను తేలిగ్గా తీసుకోలేం. కాబట్టి ‘2.0’ వాయిదా అని ఫిక్సయిపోవడానికి లేదు. ఏదేమైనా ‘2.0’ నిర్మాతలు ఏమంటారో చూడాలి. వాళ్లు త్వరగా ఈ గందరగోళానికి తెరదించితే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు