అమ‌లాపాల్ కారుపై విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ ఆర్డ‌ర్‌!

అమ‌లాపాల్ కారుపై విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ ఆర్డ‌ర్‌!

సినీన‌టి అమ‌లాపాల్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఆ మ‌ధ్య‌న పెళ్లి చేసుకున్న ఆమె.. భ‌ర్త‌తో వ‌చ్చిన విభేదాల‌తో విడిపోయారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున వార్త‌లు ఆమెపై వ‌చ్చాయి. విడిగా ఉంటున్న ఆమె త‌న సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. ఇదంతా ఒక కోణం. తాజాగా అమ‌లాపాల్ వార్త‌ల్లోకి ఎందుకు వ‌చ్చార‌న్నది చూస్తే.. సెల‌బ్రిటీల‌కు ఇదేం క‌క్కుర్తి అనుకోకుండా ఉండ‌లేం.

కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరిలో ప‌న్ను రేట్లు త‌క్కువ‌గా ఉంటాయి. దీంతో ఖ‌రీదైన కార్ల‌ను పుదుచ్చేరిలో కొనుగోలు చేసి.. అక్క‌డే రిజిస్ట్రేష‌న్ చేయించుకొని.. దాన్ని కేర‌ళ‌లో వినియోగించిన వైనంపై ఆమెపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అమ‌లాపాల్ మాదిరే మ‌రికొంద‌రు మ‌ల‌యాళ న‌టులు ఇలాంటి క‌క్కుర్తికి పాల్ప‌డుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

అమ‌లాపాల్ విష‌యానికి వ‌స్తే బెన్స్ ఎస్ క్లాస్ కారును గ‌త ఏడాది పుదుచ్చేరిలో రూ.1.12కోట్ల‌కు కొనుగోలు చేశారు. దీన్ని కేర‌ళ‌లో రిజిస్ట‌ర్ చేయ‌టానికి రూ.20ల‌క్ష‌ల ప‌న్ను చెల్లించాల్సి ఉంది. అందుకే త‌ప్పుడు చిరునామాతో పుదుచ్చేరిలో రిజిస్ట‌ర్ చేసిన అమ‌లాపాల్ కేర‌ళ‌లో వాడుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇదే తీరులో మ‌రికొంద‌రు న‌టులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అమ‌లాపాల్ మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై అక్క‌డి గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడి స్పందించారు. ఆమె కారు విష‌యం మీద విచార‌ణ జ‌ర‌పాలంటూ తాజాగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో.. అమ‌లాపాల్ కారు కొనుగోలు వ్య‌వ‌హారంపై విచార‌ణ‌కు అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు. డ‌బ్బుల‌కు కొద‌వ‌లేని సెల‌బ్రిటీలు కూడా.. చిన్న చిన్న వాటి కోసం క‌క్కుర్తి ప‌డ‌టం ఏమిటో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు