అమ్మాయి నీ సైజు లేంటి.. అన‌డిగితే...

అమ్మాయి నీ సైజు లేంటి.. అన‌డిగితే...

ప్రస్తుతం పెరు దేశంలో మిస్ పెరు అందాల పోటీలు జరుగుతున్నాయి. సరిగ్గా దీనికి ఓ వారం క్రితం అక్కడ 'పెరు.. కంట్రీ ఆఫ్ రేపిస్ట్స్' అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండింగ్ అయిపోయింది. మహిళలపై జరుగుతున్న అరాచకాలపై ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా చాలానే విషయాలు బైటకు వచ్చాయి.

ఇంత సడెన్ గా మహిళలపై హింస అనే పాయింట్ ఎందుకు రైజ్ అయిందో అప్పుడు ఎవరికీ అర్ధం కాలేదు. కానీ తాజాగా జరిగిన మిస్ పెరు అందాల పోటీల్లో అసలు విషయం బైటకు వచ్చింది. ఎంత ప్లాన్డ్ గా ఈ అందాల పోటీలను.. వాటితో పాటే మహిళలపై జరుగుతున్న అరాచకాల లెక్కలను బైటకు తెచ్చారో తెలుస్తుంది. అందాల పోటీలు అంటే అమ్మాయిలు వారి వారి బాడీ కొలతలను చెప్పడం సహజమే. కానీ అక్కడే అసలు విషయం బైటకొచ్చింది. ఈ పోటీలో పాల్గొన్న ప్రతీ బ్యూటీ.. తన మెజర్మెంట్స్ చెప్పడంలో భాగంగా.. అందుకు బదులుగా తమ దేశంలో మహిళలపై జరుగుతున్న అరాచకాల లెక్కలు చెప్పడం హైలైట్ అయింది.

మొదటగా మైక్ తీసుకున్న ఓ బ్యూటీ 'నా పేరు కామిలా కనికోబా.. నేను లిమా డిపార్ట్ మెంట్ రిప్రెజెంట్ చేస్తున్నా. నా కొలతలు ఏంటంటే.. గత 9 ఏళ్లలో నా దేశంలో 2202 మహిళలు హత్యకు గురయ్యారు' అని చెప్పింది. అందరూ షాకైపోయారు ఆ మాట విని. అయితే ఇది అక్కడితో ఆగలేదు.

బ్యూటీ కాంటెస్ట్ లో టైటిల్ విన్నర్ గా నిలిచిన రోమినా లొజానా.. 'నా కొలతలు ఏంటంటే.. 2014వరకూ 3114 మంది మహిళలు ట్రాఫికింగ్ కు గురయ్యారు' అని చెప్పింది.

'నా కొలతలు ఏంటంటే.. 65 శాతం మంది యూనివర్సిటీ మహిళలు తమ భాగస్వాముల చేతిలో హింసకు గురయ్యారు' అని బెల్జికా గుయెర్రా చెప్పింది.

అందరూ ఒకటే టాపిక్ పై మాట్లాడ్డంతోనే ఇది ప్రీప్లాన్డ్ అనే విషయం అర్ధమైపోయింది. ఈ పెరు బ్యూటీ కాంటెస్ట్ దెబ్బకు.. my measurements are.. అనే హ్యాష్ ట్యాగ్  (పెరూవియన్ బాషలో #MisMedidasSon అంటూ) ఇప్పుడు విపరీతమైన ట్రెండింగ్ అయిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు