ప్రభాస్‌ టీమ్‌తో పెద్దోళ్లకి తలనొప్పి

ప్రభాస్‌ టీమ్‌తో పెద్దోళ్లకి తలనొప్పి

నిర్మాణ రంగంలో పెద్దగా అనుభవం లేకపోయినా కానీ యువి క్రియేషన్స్‌ సంస్థకి ఆల్రెడీ ఒక బ్రాండ్‌ వేల్యూ ఏర్పడింది. ఈ సంస్థ నుంచి వచ్చే సినిమా బాగుంటుందని పేరు రావడంతో బయ్యర్లు కూడా ఎగబడి రైట్స్‌ తీసుకుంటున్నారు. హీరోతో పని లేకుండా బ్యానర్‌ని నమ్మి బిజినెస్‌ జరిగే లెవల్‌కి ఈ సంస్థ ఎదిగిపోయింది.

నిర్మాణంలో అడుగు పెట్టడానికి ముందే పంపిణీ రంగంలో అనుభవం పొందిన ఈ సంస్థ నిర్వాహకులు ప్రభాస్‌కి ప్రాణమిత్రులు. ఇప్పుడీ బ్యానర్‌ ప్రభాస్‌ హోమ్‌ బ్యానర్‌లాంటిదే. తన ప్రతి రెండు చిత్రాల్లో ఒకటి వీరికి చేసేలా ప్రభాస్‌ ఒప్పందం కూడా చేసుకున్నాడు. ప్రభాస్‌ తరఫునుంచి ఇండస్ట్రీలోకి దిగిన ఈ బృందం ఇపుడు టాప్‌ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా యువిని నిలబెట్టారు. వీరి రిలీజ్‌ స్ట్రాటజీ, ప్లానింగ్‌ కూడా చాలా బాగుంటుందని అందరూ ఒప్పుకుని తీరాలి. భారీ సినిమాలకి పోటీగా తమ చిత్రాలు రిలీజ్‌ చేసి హిట్‌ చేసుకున్నారు.

ఎన్ని సినిమాలు రిలీజ్‌ అయినా బెస్ట్‌ థియేటర్లు రిజర్వ్‌ చేసుకుంటూ వుంటారు. దీని వల్ల పోటీ టైమ్‌లో పెద్ద చిత్రాలకి మంచి థియేటర్లు దొరకడం లేదు. సంక్రాంతికి భాగమతి విడుదల చేయాలని చూస్తోన్న యువి సంస్థ ఇప్పటికే థియేటర్ల వారితో ఒప్పందాలు కూడా మొదలు పెట్టిందని సమాచారం. అజ్ఞాతవాసి, జైసింహా లాంటి పెద్ద చిత్రాలున్నా కానీ దీని కోసం థియేటర్లు పెద్ద సంఖ్యలో బుక్‌ అవుతున్నాయి. ఇలా ప్రతి పండగకి వీళ్లు వచ్చి అడ్డు పడితే పెద్ద సినిమాలకి సరిపడా థియేటర్లుండవు. కానీ వీళ్లు చేస్తోన్న రిస్క్‌ని కాదనే హక్కు ఎవరికీ లేదు. దీంతో లోలోపలే విసవిసలాడుతున్నారు తప్ప డైరెక్టుగా ఎవరినీ ఏమీ అనడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు